పీరియాడికల్‌‌ డ్రామా ‘డెవిల్’.. డిసెంబర్ 29న వరల్డ్ వైడ్‌‌గా విడుదల

పీరియాడికల్‌‌ డ్రామా ‘డెవిల్’..  డిసెంబర్ 29న వరల్డ్ వైడ్‌‌గా విడుదల

ఇటీవల డిఫరెంట్ కాన్సెప్టులను సెలెక్ట్ చేసుకుంటూ తన ఇమేజ్‌‌ను మరింత పెంచుకున్నాడు కళ్యాణ్ రామ్. ఆయన హీరోగా  అభిషేక్ నామా దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘డెవిల్’.  బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌‌ ట్యాగ్‌‌ లైన్‌‌తో తెరకెక్కిన  ఈ  పీరియాడికల్‌‌ డ్రామాను డిసెంబర్ 29న వరల్డ్ వైడ్‌‌గా విడుదల చేయనున్నట్టు గురువారం ప్రకటించారు. వాస్తవానికి ఈ చిత్రం నవంబర్‌‌‌‌లో రిలీజ్ కావాల్సి ఉంది.. కానీ బ్యాక్‌‌గ్రౌండ్‌‌ స్కోరు, వీఎఫ్‌‌ఎక్స్ లాంటి టెక్నికల్ కారణాల వలన వాయిదా వేశారు.

ఇప్పుడు ఫైనల్ అవుట్‌‌పుట్ రెడీ అవడంతో కొత్త రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేశారు. తెలుగుతో పాటు త‌‌మిళ, క‌‌న్నడ, హిందీ భాష‌‌ల్లో సినిమా విడుదల కానుంది.  సంయుక్త మీనన్, మాళవిక నాయర్ హీరోయిన్స్‌‌గా నటిస్తున్న ఈ  చిత్రానికి  శ్రీకాంత్ విస్సా కథ, మాటలు,  స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.  హ‌‌ర్షవ‌‌ర్ధన్ రామేశ్వర్‌‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.