సింగిల్ రిలీజ్ కావాలన్నారు.. మరి సౌండ్ ఏది రవన్నా?

సింగిల్ రిలీజ్ కావాలన్నారు.. మరి సౌండ్ ఏది రవన్నా?

ఈ మధ్య రవితేజ(Raviteja) వైరల్ అయినంతగా ఏ హీరో కాలేదు. ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle). పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ కెమెరామెన్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా నిజానికి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ సంక్రాంతి వరుస సినిమాలు పెటపడటంతో పోటీనుండి తప్పుకుంది ఈగల్ మూవీ. దీంతో ఈ సినిమాకు సింగల్ రిలీజ్ ఉండేలా ప్లాన్ చేస్తామని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హామీ ఇచ్చారు. ఇటీవలే ఆ వివాదం ముగిసింది. 

ఇదిలా ఉంటే.. ముందు నుండే ఈగల్ సినిమాకు పెద్దగా బజ్ క్రియేట్ అవడం లేదు. నిజానికి రవితేజ సినిమా అంటే ఆ హంగామా ఎలా ఉండాలి. ఆ రేంజ్ ప్రమోషన్స్ ఏమీ చేయడంలేదు మేకర్స్. నిజంగా సినిమాలో కంటెంట్ ఉండొచ్చు.. కానీ, జనాలు థియేటర్స్ కి రావాలంటే మాత్రం ప్రమోషన్స్ కంపల్సరీ. ఫిబ్రవరి 9న ఈగల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కు ఇంకో వారమే సమయం ఉంది. అయినప్పటికి ఈగల్ సినిమాపై పెద్దగా బజ్ క్రియేట్ అవడం లేదు. ఈ గ్యాప్ లో భారీ రేంజ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తే తప్పా జనాలు థియేటర్స్ కి రావడం కష్టమే. ఇవన్నీ గమనిస్తున్న నెటిజన్స్.. రావన్నా.. ఏంటన్నా ఈ సైలెన్స్. సౌండ్ పెంచు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వారం రోజుల్లో మేకర్స్ ఏమైనా మ్యాజిక్ చేస్తారేమో చూడాలి.