అద్భుతం, అదృష్టం అంటే ఏంటో చెప్పడానికి కొన్ని సంఘటనలు నిదర్శనంగా నిలుస్తూ ఉంటాయి... అలాంటి ఘటనల్లో కచ్చితంగా టాప్ ప్లేస్ లో ఉంటుంది ఈ ఘటన. ఈ భూ ప్రపంచంలో ఇంతకు మించిన అద్భుతం ఇంకేదీ ఉండదు...ఇంతకు మించిన అదృష్టం మరెవరికి ఉండదని... బల్ల గుద్ది చెప్పచ్చు. సింహం దాడి చేసినా ఏమాత్రం జంకకుండా... ప్రశాంతంగా దాని చెంపపై నిమిరి ప్రాణాలతో బయటపడ్డాడు ఓ వ్యక్తి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఒక ఆడ సింహానికి, గ్రామస్థుడికి మధ్య జరిగిన ఘర్షణలో అద్భుతంగా ప్రశాంతంగా వ్యవహరించి ప్రాణాలతో బయటపడ్డాడు. పాలిటానా సమీపంలోని గరాజియా గ్రామంలో ఆదివారం ( జులై 5 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
LION ATTACKS ON ANIMAL CARE TAKER 🚨
— Jeet (@JeetN25) July 6, 2026
A lioness attacked a Maldhari family near Palitana in Gujarat's Bhavnagar district.
- Lion trapped the guy for 30 minutes😨
- Look at the guy how he consoles Lion by Touching his head 😭
- After being rescued and rushed to a hospital for… pic.twitter.com/gWYDg9AYkX
ఆగి ఉన్న ఒక ట్రక్కు పక్కన, గాయపడిన వ్యక్తిని ఆడ సింహం నేలపై పట్టుకుని ఉండగా, భయపడిన గ్రామస్తులు దూరం నుండి చూస్తున్నట్లు వీడియోలో తెలుస్తోంది. సింహందృష్టి మరల్చడానికి జనం కేకలు వేసి, రాళ్లు విసిరినప్పటికీ, భయంతో ఎవరూ దగ్గరకు వెళ్లలేదు. ఆ ఉద్రిక్త క్షణాలలో, గాయపడిన వ్యక్తి కదలకుండా ఉండిపోయాడు. సింహాన్ని మరింత రెచ్చగొట్టకుండా దానిని ప్రశాంతంగా నిమిరాడు. కొన్ని నిమిషాల తర్వాత, ఆ సింహం అతన్ని విడిచిపెట్టి, దగ్గరలోని పశువుల దొడ్డి వైపు నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్లిపోయింది.
గాయపడిన వ్యక్తిని గ్రేటర్ గిర్ ప్రాంతంలో సాంప్రదాయకంగా ఆసియా సింహాలతో కలిసి జీవిస్తున్న మల్ధారి పశుపోషణ వర్గానికి చెందిన కలుభాయ్ పర్మార్‌గా గుర్తించారు అధికారులు. అతడిని మొదట పలితానాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి, తదుపరి చికిత్స కోసం భావ్‌నగర్‌కు తరలించారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని... గాయాల నుంచి కోలుకుంటున్నాడని తెలిపారు అధికారులు.సింహం దాడి చేసినా జంకకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించిన కులుభాయ్ ని ప్రశంసించింది అటవీశాఖ.
