జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రెజెంట్ ఈ బ్యూటీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన 'పెద్ది' సినిమాలో నటిస్తోంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా జూన్ 4న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, రామ్ చరణ్, జాన్వీ కపూర్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా గడుపుతున్నారు.
బాబోయ్.. మలయాళం నావల్ల కాదు..
అయితే, లేటెస్ట్ గా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలలో జాన్వీ కపూర్ చేసిన కొన్ని క్రేజీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మలయాళ భాషపై ఆమె చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. గత ఏడాది వచ్చిl 'పరమ్ సుందరి'లో మలయాళీ, తమిళ్ మూలాలున్న అమ్మాయిగా జాన్వీ నటించింది.. ఆ అనుభవాన్ని లేటెస్ట్ గా పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాకు తెలిసి ఇకపై నేను మలయాళ సినిమాల్లో నటించే సాహసం చేయకపోవచ్చు. అది చాలా అందమైన, మధురమైన భాష అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, పలకడం మాత్రం నాకు చాలా కష్టం. ఆ భాష నేర్చుకోవడానికి నేను పడ్డ తిప్పలు అన్నీ ఇన్నీ కావు అంటూ నవ్వేసింది.
తెలుగు, తమిళ్ అంటేనే ఇష్టం..
మలయాళం కష్టమన్న జాన్వీ.. తెలుగు, తమిళ్‌పై మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. నాకు తమిళ్, తెలుగు భాషలు మాట్లాడటం చిన్నప్పటి నుంచే కాస్త అలవాటు. అందుకే టాలీవుడ్‌లో వర్క్ చేయడం చాలా ఈజీగా, కంఫర్టబుల్‌గా అనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమాలను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నా. భవిష్యత్తులో మరిన్ని క్రేజీ తమిళ్ ప్రాజెక్ట్స్ కూడా చేయాలనుంది అని తన మనసులోని మాట బయటపెట్టింది జాన్వీ..
►ALSO READ | 'నా మాట రాసి పెట్టుకోండి.. ఇది పక్కా'.. డైరెక్టర్ బుచ్చిబాబుపై రామ్ చరణ్ క్రేజీ కామెంట్స్ !
'పెద్ది'తో నెక్స్ట్ లెవెల్ క్రేజ్..
రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో వస్తున్న 'పెద్ది' సినిమా కోసం జాన్వీ కపూర్ చాలా కష్టపడింది. ఈ సినిమాలో రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పక్కా లోకల్ క్యారెక్టర్‌లో ఆమె కనిపించబోతుంది. చరణ్ మాస్ అప్పీల్‌కు, జాన్వీ గ్లామర్‌కు తోడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తోడవడంతో 'పెద్ది'బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భాష ఏదైనా.. ఈ బాలీవుడ్ బ్యూటీ సౌత్ ఆడియన్స్‌ను మాత్రం పక్కాగా బుట్టలో వేసుకుంటోందని అటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. మరి 'పెద్ది'లో రామ్ చరణ్ సరసన ఏ మాత్రం మెప్పిస్తుందో చూడాలి.
Mumbai, Maharshtra: On the upcoming movie 'Peddi', Actor Janhvi Kapoor says, "I don't think I should attempt Malayalam again because it's too difficult. For me, it's such a beautiful, sweet language. But I think I've been phonetically quite familiar with Tamil and Telugu. So I'm… pic.twitter.com/QJAuRbYfQ8
— IANS (@ians_india) May 29, 2026
