సలార్ మూవీకి నో ప్రమోషన్స్, నో ప్రీ రిలీజ్ ఈవెంట్.. రిస్క్ చేస్తున్న ప్రశాంత్?

సలార్ మూవీకి నో ప్రమోషన్స్, నో ప్రీ రిలీజ్ ఈవెంట్.. రిస్క్ చేస్తున్న ప్రశాంత్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ సలార్(Salaar). ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు డిసెంబర్ 22న రిలీజ్ కు సిద్దంగా ఉంది. కేజీఎఫ్ చిత్రాలతో నేషనల్ వైడ్ సెన్సేషన్‌ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక టీజర్, ట్రైలర్ కూడా అంచనాలకు మించి ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సలార్ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నారు. కారణం ప్రభాస్ కు బాహుబలి తరువాత ఒక్క హిట్టు కూడా లేకపోవడం. కాబట్టి.. సలార్ సినిమాకు కాస్త పాజిటీవ్ టాక్ వస్తే చాలు.. ఇండస్ట్రీ హిట్టు చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. అయితే.. సలార్ సినిమా గురించి ఫ్యాన్స్ ఒకలా ఆలోచిస్తుంటే.. మేకర్స్ మరోలా ఆలోచిస్తున్నారు. అదేంటంటే.. సలార్ సినిమాకు ఎలాంటి ప్రమోషన్స్ ప్లాన్ చేయడం లేదట. అంతేకాదు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఈ వార్త తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త కంగారుపడుతున్నారు. 

ఏ సినిమానైనా జనాల్లోకి తీసుకెళ్లాలంటే ప్రమోషన్స్ చాలా అవసరం. ఇక సలార్ లాంటి సినిమాలకైతే మరీ ముఖ్యం. కారణం.. ఈ సినిమాకు మేకర్స్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ పెట్టారు. కాబట్టి అదే రేంజ్ లో ఓపెనింగ్స్ ఉంటేనే హిట్ గా నిలిచే అవకాశం ఉంటుంది. దానికి ప్రమోషన్స్ చాలా అవసరం. మరి ఇలాంటి సమయంలో నో ప్రమోషన్స్ అంటూ సలార్ మేకర్స్ తీసుకుకున్న డెసిషన్ ఫ్యాన్స్ ను కాస్త కలవరపెడుతోంది. మరి ఈ ప్రభావం సలార్ ఓపెనింగ్స్ పై పడనుందా? లేక ప్రభాస్ పేరుతో కలెక్షన్స్ అవే వచ్చి పడతాయా? అనేది చూడాలి.