సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటా

 సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటా

నాగార్జున సాగర్ నియోజకవర్గానికి గాను టీఆర్ఎస్ పార్టీ తరఫున తనకు టికెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు నోముల భగత్. టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు. సాగర్ లో లక్షా 50వేల మందికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. తన తండ్రి మరణం తర్వాత వచ్చిన ఎన్నికలు కావడంతో ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకం ఉందన్నారు. బీజేపీ సాగర్ లో 2018కి ముందు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందన్నారు నోముల భగత్.