ఇంట్లో ఇడియాప్పమ్, నూడుల్స్, పాస్త లాంటివి చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ.. అందుకు చాలా టైం పడుతుంది. అయితే.. ఈ మెషిన్‌తో వాటిని ఈజీగా, చాలా ఫాస్ట్‌గా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఐబెల్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని లోడింగ్ ట్యూబ్‌లో పిండిని పెట్టి బటన్ నొక్కితే చాలు. కేవలం 17 సెకన్లలోనే ఫ్రెష్ నూడుల్స్, పాస్తా, ఇడియాప్పమ్.. ఇలా ఏ మోల్డ్ అమర్చితే ఆ ఆకారంలో పిండి బయటికి వస్తుంది.
ఇందులో పవర్‌ఫుల్ రీచార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే దాదాపు 50 సార్లు ఉపయోగించుకోవచ్చు. ఈ ప్యాక్‌లో వేర్వేరు రకాల నూడుల్స్, ఇడియాప్పమ్ సైజుల కోసం 5 రకాల మార్చుకోగలిగే అచ్చులు (మోల్డ్స్) వస్తాయి. వాటితో మురుకులు, రిబ్బన్ పకోడా లాంటివి కూడా చేసుకోవచ్చు. ఇది లైట్‌వెయిట్ డిజైన్‌తో వస్తుంది. దీని విడిభాగాలను సులభంగా వేరుచేసి క్లీన్ చేసుకోవచ్చు. దీని ధర రూ.2990
