సినీ ఇండస్ట్రీలో లవ్ ట్రాక్ ల కు కొదవుండదు. ఏ ఒక్క జంట కలిసిన రూమర్లు షికారు చేయడం సర్వసాధారణం. లేటెస్ట్ గా ఈ లిస్ట్‌లోకి బాలీవుడ్ హాట్ బ్యూటీ, డ్యాన్స్ క్వీన్ నోరా ఫతేహి చేరిపోయింది. ఈసారి ఈమె దిల్ దొంగిలించింది మరెవరో కాదు... మొరాకో స్టార్ ఫుట్‌బాల్ గోల్‌కీపర్, అల్ హిలాల్ ప్లేయర్ యాసిన్ బౌనౌ (బోనో). వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
కాసాబ్లాంకా వీధుల్లో చెట్టాపట్టాల్..
మే 28న మొరాకోలోని కాసాబ్లాంకా సిటీకి చెందిన ఐన్ దియాబ్ ప్రాంతంలో నోరా, యాసిన్ జంటగా కెమెరా కంటికి చిక్కారు. ఆ ఫొటోలు కాస్తా ఇంటర్నెట్‌లో లీక్ అవ్వడంతో ఈ రూమర్లకు రెక్కలొచ్చాయి. అంతేకాదు, నోరా రీసెంట్‌గా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లోని డ్రెస్, ఆ రోజు యాసిన్‌తో ఉన్నప్పుడు వేసుకున్న డ్రెస్ ఒకటే కావడంతో అటు ఫ్యాన్స్ దొరికేసారుగా అంటూ ఫిక్స్ అయిపోయి కామెంట్స్ చేస్తున్నారు. పైగా, కొద్దిరోజుల క్రితం సౌదీ అరేబియా వెళ్లిన నోరా... అక్కడ యాసిన్ టీమ్‌మేట్స్‌ని కూడా కలిసిందని టాక్. ఇంకేముంది, పెళ్లి చూపులు కూడా అయిపోయాయా ఏంటి అంటూ నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
شفت مؤخرا هاد الشائعه في مجموعه من الصفحات 🇲🇦 و نقلاتها حتى مواقع اجنبيه، هل هو تشويش على الحارس رقم 1 للمنتخب الوطني؟
— Leila Ben Shitrit ✨ⵍⴰⵢⵍⴰ ⴱⵏ ⵛⴻⵜⵔⵉⵉⵜ✨ (@1__leila) May 31, 2026
بعض تقارير تحدثت عن مشاهدة ياسين بونو و نورة فتحي في عين الذياب يوم 28 ماي
حتى الآن، لا يوجد أي تأكيد أو نفي رسمي من الطرفين، وتبقى كل الأخبار مجرد تكهنات. pic.twitter.com/sbzsEFa8I3
ఆల్రెడీ పెళ్లయిందా..
అయితే ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, యాసిన్ బౌనౌకి 2012లోనే ఇమానే ఖల్లాద్‌తో వివాహం జరిగింది. వీరికి ఇసాక్ అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం. ఈ గ్యాప్‌లోనే నోరాతో లవ్ ట్రాక్ మొదలైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నోరా పేరు మరో మొరాకో ఫుట్‌బాల్ స్టార్ అష్రాఫ్ హకీమితో కూడా వినిపించింది. అయితే, ఈ డేటింగ్ వార్తలపై అటు నోరా కానీ, ఇటు యాసిన్ కానీ ఇప్పటివరకు నోరు మెదపలేదు.
ఫిఫా వరల్డ్ కప్‌లో నోరా రచ్చ..
ఈ రూమర్లు ఎలా ఉన్నా.. నోరా మాత్రం తన కెరీర్ వేటలో దూసుకుపోతోంది. ఈ ఏడాది జూన్ 12న టొరంటోలో జరగబోయే ఫిఫా వరల్డ్ కప్ 2026 ఓపెనింగ్ సెర్మనీలో ఈ గ్లోబల్ బ్యూటీ స్టేజ్ దద్దరిల్లేలా పర్ఫార్మ్ చేయబోతోంది. మైఖేల్ బుబ్లే, అలానిస్ మోరిసెట్ వంటి ఇంటర్నేషనల్ సింగర్స్‌తో కలిసి కొత్త ఫిఫా యాంథమ్‌తో దుమ్మురేపడానికి నోరా రెడీ అవుతోంది. లవ్ రూమర్స్ పక్కన పెడితే.. నోరా క్రేజ్ మాత్రం ఇప్పుడు గ్లోబల్ లెవెల్‌లో నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళిపోయింది.
TORONTO STAND UP! Fifa World cup countdown concert June 10th..SAVE THE DATE! we waana see you there! Lets kick off the world cup with some VIBES! Performing my upcoming fifa world cup song and some more! 🔥🙌🏽 @FIFAWorldCup pic.twitter.com/VucRzmN40U
— Nora Fatehi (@iamnoraf) June 1, 2026
