సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప షాకింగ్స్ కామెంట్స్ చేశాడు. ఈ సీజన్‌లో ఎస్ఆర్హెచ్కు టైటిల్ గెలిచేంతా సత్తా లేదని.. టైటిల్ రేసులో ఆ టీమ్ గట్టి పోటీదారు కాదని అన్నాడు. ఈ మేరకు జియో హాట్ స్టార్‌లో ఊతప్ప మాట్లాడుతూ.. ‘‘ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలుచుకునే గట్టి పోటీదారు కాదు. ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగా ఉన్నప్పటికీ అది వారు టైటిల్ గెలవడానికి సరిపోదు. ఎందుకంటే ఆ టీమ్ బౌలింగ్ బలహీనంగా ఉంది. బౌలర్లే ట్రోఫీ గెలిపించేవారు’’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియం పిచ్ ఫ్లాట్‌గా ఉంటుందని.. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఆ పిచ్‌పై బౌలర్లు మరీ ఎక్కువ వేగంతో బంతులు వేయొద్దని సూచించాడు. ఉప్పల్ వంటి ఫ్లాట్ పిచ్‌పై మహమ్మద్ షమీ లాంటి మేటి బౌలర్ కూడా వికెట్లు తీయలేడని.. అలాంటి పిచ్‌పై వికెట్లు తీయాలంటే భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్ అవసరమని చెప్పాడు. బౌలర్లు స్వింగ్, యార్కర్స్, బాల్ వేరియేషన్స్ మారుస్తూ ఉండాలని సూచించాడు. ఉప్పల్ పిచ్‌పై ఎక్కువ వేగంతో బౌలింగ్ చేయకూడదని.. ఎందుకంటే అక్కడ బంతి ఎక్కువగా సీమ్ అవ్వదన్నాడు.
►ALSO READ | CSK Players: ఐపీఎల్ 2026లో సీఎస్కేకు భారంగా మారిన ముగ్గురు ఆటగాళ్లు
ఒకవేళ హైదరాబాద్ బ్యాటింగ్‌లో విఫలమైతే చిన్న టార్గెట్లను కాపాడే బౌలింగ్ దళం ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ దగ్గర లేదని కుండబద్దలు కొట్టాడు. ‘‘గత సీజన్‌లో కూడా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాసెన్ తప్ప మరే బ్యాటర్ రాణించలేకపోయాడు. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు బౌలర్లు స్కోర్లను కాపాడలేకపోయారు. అందుకే ఈ సీజన్‌లో నేను ఎస్ఆర్‌హెచ్‌ను టైటిల్ గెలుచుకునే బలమైన పోటీదారుగా పరిగణించను’’ అని ఉతప్ప పేర్కొన్నాడు. ఈ సీజన్ లో ఎస్ఆర్ హెచ్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉన్నప్పటికీ.. ఊతప్ప చెప్పినట్లుగానే బౌలింగ్ యూనిట్ మాత్రం పేలవంగా ఉంది.
ఐపీఎల్ 2026 సీజన్ SRH జట్టు:
సలీల్ అరోరా, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, రవిచంద్రన్ స్మరన్, అనికేత్ వర్మ, అభిషేక్ శర్మ, బ్రైడన్ కార్సే, హర్ష్ దూబే, లియామ్ లివింగ్‌స్టోన్, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ మావి, పాట్ కమిన్స్, అమిత్ కుమార్, ఇ హరఫుల్, క్రైన్స్ ఎఫ్. పటేల్, సాకిబ్ హుస్సేన్, శివంగ్ కుమార్, ఓంకార్ తర్మలే, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ.
