
ప్రశాంత్ వర్మ(Prasanth Varma).. సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పేరు గురించే చర్చ నడుస్తోంది. ఈ దర్శకుడు తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ హనుమాన్(HanuMan) బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.40 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రూ.300 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను సైతం అవాక్కయ్యేలా చేసింది. ఇక హనుమాన్ సినిమాను స్రీన్ పై ప్రెజెంట్ చేసిన విధానానికి ప్రశాంత్ వర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంత తక్కువ బడ్జెట్ లో ఆ రేంజ్ వీఎఫెక్స్ చూపించడం అన్ బిలీవేబుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విడుదలై మూడు వారాలు గడుస్తున్నా కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ చాలా చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది ఈ మూవీ.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ తన తరువాతి సినిమాల గురించి, హనుమాన్ తరువాత వచ్చిన ఆఫర్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. హనుమాన్ సినిమా చూసిన ఒక NRI ప్రశాంత్ కు ఏకంగా రూ.1000 కోట్లు ఆఫర్ ఇచ్చాడట. హనుమాన్ చూసి ఇంప్రెస్ అయినా ఆ NRI తరువాత తనతో సినిమా చేయమని, అందుకోసం రూ.1000 కోట్లు పెడతానని చెప్పరటా. అయితే.. ఆ ప్రాజెక్టు ఖచ్చితంగా భారతీయ ఇతిహాసాల పైనే ఉండాలని కండీషన్ పెట్టాడట. అయితే ఆ ఆఫర్ ఒకే అయ్యిందా? లేదా? అనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ప్రశాంత్ వర్మ.
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ న్యూస్ విన్న నెటిజన్స్.. ఒప్పుకో అన్నా. నువ్వు మన ఇతిహాసాల మీద ఒక సినిమా తప్పకుండా చేయాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి కేవలం నాలుగు సినిమాలు చేసిన దర్శకుడికి రూ.1000 కోట్ల ఆఫర్ రావడం అనేది మాములు విషయం కాదు. ప్రశాంత్ కు ఇంత తొందరగా రావడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పాలి. మరి ఈ ఆఫర్ ను ప్రశాంత్ ఒప్పుకుంటాడా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తికరకంగా మారింది.