ఎన్టీఆర్ బర్త్‌‌‌‌డే స్పెషల్ ట్రీట్

ఎన్టీఆర్ బర్త్‌‌‌‌డే స్పెషల్ ట్రీట్

తమ అభిమాన హీరో బర్త్‌‌‌‌డే వస్తుందంటే ఫ్యాన్స్ ఓ పండుగలా సెలబ్రేట్ చేస్తారు. అలాగే స్టార్స్ సైతం అభిమానులకు తమ చిత్రాల అప్‌‌‌‌డేట్స్‌‌‌‌తో ట్రీట్ ఇస్తుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ తన బర్త్‌‌‌‌డేకి ట్రిపుల్ ట్రీట్‌‌‌‌తో ఫ్యాన్స్‌‌‌‌లో జోష్‌‌‌‌ని నింపబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ వైపు ‘దేవర’.. మరోవైపు ‘వార్‌‌‌‌‌‌‌‌ 2’ చిత్రాల షూటింగ్స్‌‌‌‌తో బిజీగా ఉన్నాడు. వీటితో పాటు ప్రశాంత్‌‌‌‌ నీల్‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌లోనూ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. 

ఈ సందర్భంగా ఈ మూడు సినిమాల అప్‌‌‌‌డేట్స్‌‌‌‌తో అభిమానులకు ట్రిపుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట.  కొరటాల శివ రూపొందిస్తున్న ‘దేవర’ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్, అలాగే ‘వార్ 2’ నుంచి ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్‌‌‌‌తో తారక్‌‌‌‌కు బర్త్‌‌‌‌డే విషెస్ తెలియజేసేందుకు ఆయా మూవీ మేకర్స్  ప్లాన్ చేస్తున్నారట. అలాగే ప్రశాంత్ నీల్ కూడా తమ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్‌‌‌‌డేట్‌‌‌‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. దీంతో ఈ ట్రిపుల్ ట్రీట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్‌‌‌‌‌‌‌‌గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు  రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘దేవర’ ఫస్ట్ పార్ట్‌‌‌‌ దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.