
టాలీవడ్ ప్రముఖ హీరో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం సెప్టెంబర్ 27న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి ప్రముఖ సినీ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. బాలీవడ్ స్టార్ హీరో విలన్ పాత్రలో నటించగా ప్రకాష్ రాజ్, శృతి మరాఠీ, శినే టామ్, మురళీ శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించాడు. అయితే విడుదలకి ముందే దేవర చిత్రం రికార్డులు సృష్టిస్తోంది.
అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో రోజుకో అప్డేట్ ఇస్తూ దేవర చిత్రంపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఆయుధ పూజ పాట ప్రోమోని యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ ప్రోమోలో సైఫ్ అలీఖాన్ మరియు ఎన్టీఆర్ డ్యాన్స్, ఫైట్ సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. అలాగే ఈ ప్రోమో విడుదల చేసిన గంటలోనే దాదాపుగా 4,50,000 పైచిలుకు వచ్చాయి. దీంతో యూట్యుబ్ లో ఎటు చుసిన తారక్ దేవర ట్రెండ్ అవుతోంది.
ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే పలువురు టాలీవుడ్ సినీ సెలెబ్రెటీలు సైతం దేవర చిత్రం మంచి హిట్ అవ్వాలని సోషల్ మీడియా వేదికగా విషెష్ చెబుతున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే ఏకంగా కటౌట్లు, మార్నింగ్ షోస్ అంటూ థియేటర్ల వద్ద హంగామా మొదలెట్టారు. మరి దేవర చిత్రం ఏవిధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.