Devara Postponed: దేవర విడుదల వాయిదా!..ఆ స్టార్ హీరోకి పోటీగా

Devara Postponed: దేవర విడుదల వాయిదా!..ఆ స్టార్ హీరోకి పోటీగా

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara). టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ ఐనా క్షణాల్లో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. ఇక తాజాగా మరోసారి దేవర మూవీ ట్రేండింగ్ లోకి వచ్చింది. 

అయితే ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన దేవర పార్ట్-1 రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా రిలీజ్ వాయిదా పడడం కన్ఫమ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు గల పలు కారణాలు లేకపోలేదు. దేవరలో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్‌ ఇటీవల షూటింగ్‌లో గాయాలు అవడం ఒకటైతే..త్వరలో ఏపిలో ఎలక్షన్స్ కూడా ఒక కారణమని తెలుస్తోంది. 

వీటన్నికంటే మరి ముఖ్యమైన కారణం ఏంటంటే..దేవర సినిమాలోని వీఎఫ్ఎక్స్ విషయంలో మేకర్స్ ముందు అనుకున్న టైం సరిపోవటలేదట.ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పడుతోందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇలా పలు కారణాల చేత..దేవర సినిమా రిలీజ్ ను మేకర్స్ పోస్ట్ పోన్ చేస్తున్నారట. ఒకవేళ దేవర కనుక రిలీజ్ వాయిదా పడితే..ఆగస్టు 15 న రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

అయితే ఎంతోకాలంగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.ఒకవేళ దేవర ఆగష్టు 15కి రిలీజ్ అయితే మాత్రం..అల్లు అర్జున్ పుష్ప2 కూడా పోస్ట్ పోన్ అయినట్టే. దేవర పోస్ట్ ఫోన్ విషయంలో ఎటువంటి క్లారిటీ లేకపోయినప్పటికీ..దేవర పార్ట్ 1, పుష్ప 2 రిలీజ్ డేట్స్ ఒకేరోజు ఉండటంతో ఈ న్యూస్ అభిమానులను కన్ఫ్యూజన్లో పడేశాయి. మరి ఏమవుతుందో చూడాలి. 

ఇక దేవర సినిమా విషయానికి వస్తే..ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ క్రియేషన్స్ బ్యానర్స్ పై హీరో కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.