ఎన్టీఆర్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. మూడు నెలలు వాయిదాపడనున్న దేవర!

ఎన్టీఆర్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. మూడు నెలలు వాయిదాపడనున్న దేవర!

Ntr Devara: సినిమా రిలీజ్ డేట్స్ విషయంలో ఒక్కోసారి మేకర్స్ వేసుకున్న ప్లాన్స్ వర్కవుట్ కావు. షూటింగ్ మొదట్లోనే కొందరు విడుదల తేదీని కూడా ప్రకటించేస్తారు. కానీ ఏవో కారణాల వలన  అప్పటి పరిస్థితులకు రిలీజ్ అయ్యే చాన్స్ ఉండదు. అలాంటి పరి స్థితే ఎన్టీఆర్(Ntr) దేవర(Devara) చిత్రానికి వచ్చినట్టు తెలుస్తోంది. కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కు తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌‌ను ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

కానీ ఆ డేట్‌‌కు వచ్చే చాన్స్ లేదని ప్రచారం జరుగు తోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయి నా, వీఎఫ్‌‌ఎక్స్‌‌తో పాటు సినిమాలో విలన్ రోల్ చేస్తున్న సైఫ్ అలీఖాన్‌‌ కు ఇటీవలే గాయాలవడంతో తన పోర్షన్ షూటింగ్ బ్యా లెన్స్ ఉండటంతో మరో మూడు నెలలు రిలీజ్‌‌ను వాయిదా వేస్తున్నట్టు  తెలుస్తోంది. ఇదొక హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా. జాన్వీకపూర్ హీరోయిన్‌‌గా నటి స్తుంది.  ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషి స్తున్నారు. రీసెంట్‌‌గా విడుదలైన టీజర్ సినిమాపై బజ్‌‌ను పెంచింది.  కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.