ఎన్టీఆర్ టీజర్‌ వచ్చేస్తోంది! గంభీరమైన దేవర దర్శనం ఎప్పుడంటే?

ఎన్టీఆర్ టీజర్‌ వచ్చేస్తోంది! గంభీరమైన దేవర దర్శనం ఎప్పుడంటే?

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవర(Devara). యువసుధ క్రియేషన్స్(Yuvasuda creations) అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్(Ntr arts) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శివ కొరటాల(shiva koratala) తెరకెక్కిస్తున్నారు. 

లేటెస్ట్గా దేవర నుంచి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా ఎన్టీఆర్ దేవర నుంచి ఫస్ట్ లుక్ అండ్ టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ క్రిస్మస్కి రిలీజ్ అవ్వకపోతే జనవరి1న న్యూ ఇయర్ స్పెషల్గా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దీనిపై త్వరలో మేకర్స్ ఆఫీషయల్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ విన్న తారక్ ఫ్యాన్స్ కళ్ళు చెదిరే గంభీరమైన దేవరను చూడటానికి వెయిట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో నీటి అడుగున, నీటిపైన నైట్ ఎఫెక్ట్‌‌లో,తక్కువ లైట్‌లో నీళ్లల్లో అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఆడియన్స్ కు గూస్బంప్స్ తెప్పిస్తాయని టాక్. ఆర్ఆర్ఆర్ మూవీ తరువాత తారక్ నుండి వస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా ఏ న్యూస్ వినిపించిన క్షణాల్లో వైరల్ అవుతోంది. 

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో..మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్(Saif ali khan) విలన్ గా నటిస్తున్నారు.ఈ మోస్ట్ వెయిటెడ్ దేవర సినిమా వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.