ఎన్టీఆర్కు ఆస్కార్ అకాడమీ అరుదైన గౌరవం.. యాక్టర్స్ బ్రాంచ్లో చోటు

ఎన్టీఆర్కు ఆస్కార్ అకాడమీ అరుదైన గౌరవం.. యాక్టర్స్ బ్రాంచ్లో చోటు

ఆర్ఆర్ఆర్(RRR) లాటి గ్లోబల్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యారు. గ్లోబల్ ఆడియన్స్ సైతం ఆయన నటనకు ఫిదా అయిపోయారు. అందుకే ఎన్టీఆర్ చేస్తున్న తరువాత సినిమాలపై నెక్స్ట్ లెవల్ క్రేజ్ ఏర్పడుతోంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో నాటు నాటు పాటకు ఈ అవార్డు దక్కింది. దీంతో తెలుగు సినిమా పేరు ప్రపంచ నలుమూలలా మారుమ్రోగిపోయింది. 

అయితే తాజగా ఆస్కార్ అకాడమీ మన హీరో ఎన్టీఆర్ కు అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. ఆస్కార్ అకాడమీ కొత్త మెంబర్స్ లిస్ట్ లో ఎన్టీఆర్ ని యాడ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కొత్త మెంబర్స్ గా యాక్టర్స్ బ్రాంచ్ లో ఎన్టీఆర్ ను ఆహ్వానిస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న తెలుగు హీరోగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు ఎన్టీఆర్. ఈ న్యూస్ తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ అంటూ కామెంట్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. 

Also Read :- లియో సినిమా ఎలా ఉంది?

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకతంలో దేవర అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అవుట్ అండ్ అవుట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.