
తనదైన యాక్టింగ్‌తో గ్లోబల్ లెవల్‌లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న చిత్రం ‘వార్2’. హృతిర్ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. అలాగే టీజర్‌లో ఎన్టీఆర్ లుక్, స్టైలింగ్ గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకోవడంపై ఈ మూవీ కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా ఆనందం వ్యక్తం చేశారు.
ఇండియాలోనే టాప్ స్టైలిస్ట్‌గా పేరొందిన అనైతా.. ‘వార్ 2’ కోసం ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పింది. ‘ ఆయన సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తే ఆ ఎనర్జీ అంతా అందరిలోకి వచ్చేస్తుంది. ఆయనలో ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉందనిపిస్తుంది. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎంతో ఉల్లాసంగా ఉంచుతారు. ఆయన పోషిస్తున్న పాత్రలో ఎన్నో రకాల లేయర్స్ ఉంటాయి. అందుకే ఎన్టీఆర్ కోసం చాలా లుక్స్ డిజైన్ చేశాం.
ఆయన పాత్రలోని పవర్‌ఫుల్‌నెస్‌ను చూపించేలా కాస్ట్యూమ్ డిజైన్ చేశా. ఒక హ్యూమన్ మెషిన్‌లా ఆయన్ను చూపించబోతున్నాం’ అని చెప్పడంతో ఎన్టీఆర్ పాత్రపై మరింత ఆసక్తి పెరిగింది. కియారా అద్వానీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఆగస్టు 14న తెలుగు, హిందీ, తమిళ, భాషలలో వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.