జ్యోతిష్యం: ఈ తేదీలు, అంకెల్లో పుట్టిన మహిళలు వ్యాపారంలో రాణిస్తూ.. కోట్లు సంపాదిస్తారు..!

జ్యోతిష్యం:  ఈ తేదీలు, అంకెల్లో పుట్టిన మహిళలు వ్యాపారంలో రాణిస్తూ.. కోట్లు సంపాదిస్తారు..!

సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా కొన్ని తేదీల్లో పుట్టిన వారి లక్షణాల ఆధారంగా వారిలో వ్యాపార లక్షణాలు ఎక్కువుగా ఉంటాయని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వారి మాటలతో ఇతరులను ఆకట్టుకోనే  వ్యక్తిత్వంతోపాటు మంచి ఆలోచనా శక్తి, సృజనాత్మకత కలిగి ఉంటారని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు.

న్యూమారాలజీ ప్రకారం కొంతమంది వ్యాపారంలో రాణించడానికే కొన్ని తేదీల్లో మాత్రమే  పుడతారని సంఖ్యాశాస్త్రం ద్వారా  తెలుస్తుంది.  కొన్ని నిర్దిష్ట తేదీలలో జన్మించిన మహిళలు ప్రపంచంలో వ్యాపార సామ్రాజ్యాన్ని శాసించే అవకాశం ఉంది.  ఏ నెలలోనైనా 1, 10, 19 , 28వ తేదీలలో జన్మించిన మహిళలు స్వతంత్రంగా జీవించేందుకు సాహసాలు చేస్తారు.  ఒకరిపై ఆధారపడకుండానే  నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు.  ఈ తేదీల్లో పుట్టిన వారు వ్యాపారంలో కోట్లు సంపాదించే అవకాశం ఉందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

సంఖ్యాశాస్త్రం ప్రకారం1, 10, 19 , 28 అంకెలకు మూల సంఖ్య 1... ఈ అంకెకు   సూర్యుడు అధిపతి.  ఈ తేదీల్లో జన్మించిన వారు వ్యాపారరంగంలో మంచి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.వీరి సలహాలు యజమానులకు ఎంతో ఉపయోగపడతాయి. వ్యాపారాన్ని ఒక సాధారణ పనిగా కాదు.. ఒక అవకాశంగా చూస్తారు. వారు ఎలాంటి రంగంలో వ్యాపారాన్ని ప్రారంభించినా.. అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఎందుకంటే వీరి లక్షణాలలో నాయకత్వ గుణాలు, పట్టుదల, ఆత్మవిశ్వాసం గట్టిగా ఉంటాయి.

సంఖ్యా శాస్త్రం ప్రకారం..1, 14, 23 స్థానాలకు అధిపతి బుధుడు.  ఈ స్థానాల్లో బుధుడు సంచరించే మహిళలు సమస్ఫూర్తితో ఆలోచిస్తారు.  జనాల​ అవసరాలను గుర్తించి.. మార్కెట్​లో వ్యాపార ఉత్పత్తులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. 

న్యూమరాలజిస్ట్​ ల ప్రకారం.. 8, 17, 26 తేదీల్లో పుట్టిన మహిళలు ఎంతో క్రమశిక్షణ.. పట్టుదల కలిగి ఉంటారు.  వీరికి అధిపతి శని భగవానుడు.  వీరికి చాలా ఓర్పు, సహనం ఉంటుంది.  వ్యాపారరంగంలో తమదైన ముద్రను చాటుతారు. 

3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి గురుడు అధిపతి .  వీరు ఏరంగంలో అయినా అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన మహిళలకు టీం లీడర్​ గా వ్యవహరిస్తారు.  వ్యాపారాన్ని ఎంతో చాకచక్యంగా నిర్వహిస్తూ  కోట్ల రూపాయిలు లాభాలు పొందుతారని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

పైన తెలిపిన తేదీల్లో పుట్టిన మహిళల్లో ధైర్యం, నమ్మకం, దృఢ సంకల్పం ఎంతో ఎక్కువగా కనిపిస్తాయి. ఒకసారి ఏ పని అయినా చేయాలి అనుకున్నారంటే దానిని పూర్తి చేసే వరకు వెనకడుగు వేయరు. వ్యాపారంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వారు దాన్ని భయంగా చూసే వ్యక్తులు కాదు. వాళ్లు ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో నైపుణ్యం కలవారు. ఎంతటి రిస్క్ అయినా తీసుకుని విజయాన్ని సాధించగల సత్తా వీరిలో ఉంటుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని న్యూమరాలజీ నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.