అంకెల జ్యోతిష్యం: న్యూమరాలజీ..మీరు ఏ తేదీన జన్మించారు.. ఏరంగు వస్తువులు వాడాలి.

అంకెల జ్యోతిష్యం:  న్యూమరాలజీ..మీరు ఏ తేదీన జన్మించారు.. ఏరంగు వస్తువులు వాడాలి.

సంఖ్యాశాస్త్రం జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..  ప్రతి అంకెకు ప్రాముఖ్యత ఉంటుది.  ఏ తేదీన జన్మించాం.. దాని మూలం ఏమిటి.. లక్కీనెంబర్ ఏమిటి.. మన పేరులో అక్షరాలు ఎలా ఉండాలి..ఇలా అనేక విషయాలను లెక్కించి సంఖ్యాశాస్త్ర నిపుణులు భవిష్యత్తును చెబుతున్నారు.  న్యూమరాలజిస్ట్​ లు తెలిపిన వివరాల ప్రకారం ఏ తేదీన పుట్టిన వారికి ఏ రంగు కలిసి వస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 

న్యూమరాలజీ ప్రకారం కలర్స్​ .. వ్యక్తిగత ఇష్టాలు.. మూలాంకు ఆధారంగా నిర్ణయిస్తారు.  మూలాంకు అంటే సంఖ్యశాస్త్రంలో 0 నుంచి 9 వరకు ఉన్న అంకెలు.  ఈ  అంకెల ఆధారంగా ఆత్మవిశ్వాసం.. ఆర్థిక స్థిరత్వం కలగాలంటే ఏ తేదీన జన్మించారో ఆ అంకెకు ఏ కలర్​ కలసి వస్తుందని అనే విషయాన్ని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.  

ఏ నెలలో పుట్టినా.. ఏ మాసంలో జన్మించినా ఆంగ్లేయుల క్యాలండర్​ ప్రకారం 1,10,19,28 వ తేదీల్లో జన్మించిన వారిని మూలాంక్​ 1 అని న్యూమరాలజిస్ట్​లు చెబుతున్నారు.  ఇతర తేదీల ఆధారంగా 1 నుంచి 9 అంకెల మధ్యలో మూలాంక్​ గా నిర్దేశిస్తారు. 

ములాంక్ 1 : అదృ ష్ట రంగులు: మెరూన్, ముదురు ఎరుపు .. ఈరంగులకు చెందిన వస్తువులను  1,10,19,28 వ తేదీల్లో జన్మించిన వారు ఉపయోగిస్తే ఆత్మవిశ్వాశం పెరుగుతుందని పండితులు చెబుతున్నాను.  ఇతరుల ఆలోచనలను పసిగట్టి.. వారితో ఎలా మాట్లాడాలి.. ఎంతవరకు మాట్లాడాలో ముందే అంచనా వేసేశక్తిని కలిగి ఉంటారని సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుస్తుంది. 

ములాంక్ 2 :  ఏ నెలలో అయినా  2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారికి అదృష్ట రంగు తెలుపు  ఈ రంగు.. భావోద్వేగం కలగకుండా.. చాలా ప్రశాంతతను సూచిస్తుంది. 

ములాంక్ 3 : సంఖ్యాశాస్త్రంలో ఏ నెలలోనైనా 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారి మూలాంక్ 3 అవుతుంది. జ్ఞానం, సృజనాత్మకత మరియు విస్తరణకు కారకుడైన 'బృహస్పతి' (గురువు) ఈ సంఖ్యకు అధిపతి. ఈ తేదీలలో జన్మించిన వారు నిమ్మ, ఆవాలు, లేత పసుపు రంగుల వస్తువులు వాడితే కలిసి వస్తుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

ములాంక్ 4 : సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలోనైనా 4, 13, 22 , 31వ తేదీలలో జన్మించిన వారి మూలాంక్ 4 అవుతుంది. ఈ సంఖ్యకు 'రాహువు' అధిపతి. మూలాంక్ 4 లో పుట్టిన  వ్యక్తులు కష్టపడి పనిచేసేవారు, క్రమశిక్షణ గలవారు మరియు నమ్మదగినవారు. వారు తమ జీవితంలో చాలా ఆచరణాత్మకంగా  ఉంటారు. వీరికి  తెలుపు, పసుపు , ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి. 

ములాంక్ 5: ఏదైనా నెలలో 5, 14, 23 తేదీలలో జన్మించిన వారికి మూలాంక్ 5' అవుతుంది. దీనికి అధిపతి బుధ గ్రహం. వీరు పదునైన మేధస్సు, అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు , ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వ్యాపారం, మార్కెటింగ్, మరియు మీడియా రంగాలలో వీరు రాణిస్తారు,  వీరి అదృష్ట రంగులు ఆకుపచ్చ కలర్​ అని న్యూమరాలజిస్టులు చెబుతున్నారు. 

ములాంక్ 6 : సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ నెలలోనైనా 6, 15, 24 తేదీలలో జన్మించిన వారి ములాంక్ 6 అవుతుంది. ఈ సంఖ్యకు శుక్రుడు అధిపతి. వీరు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, సృజనాత్మకత, మరియు విలాసవంతమైన జీవితాన్ని కలిగి ఉంటారు.  వీరి అదృష్ట కలర్​ వైట్​ కలర్ అని న్యూమరాలజిస్ట్​ ల ద్వారా తెలుస్తుంది. 

ములాంక్ 7: ఏదైనా నెలలో 7, 16, లేదా 25వ తేదీల్లో జన్మించిన వారి మూలాంక్ 7 అవుతుంది.ఈ మూలాంక్​ లో జన్మించిన వారు గొప్ప ఆలోచన శక్తి కలిగి ఉంటారు.  వీరు ఏదైనా విషయాన్ని ముందే పసిగడతారు.  ఈ సంఖ్యకు అధిపతి కేతువు.  వీరు ఎక్కువగా ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం,  లోతైన పరిశోధనల వైపు ఆకర్షితులవుతారు.. వీరి అదృష్ట రంగులు  తెలుపు, పసుపు , ఎరుపు.

ములాంక్ 8 :  ఏదైనా నెలలో 8, 17, లేదా 26 తేదీల్లో జన్మించిన వారి మూలాంక్  8 అవుతుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ సంఖ్యకు అధిపతి శని దేవుడు.ములాంక్ 8 లో ఉన్న తేదీల్లో జన్మించిన వారు చాలా కష్టపడతారు. శని ప్రభావం వల్ల ఏ పనిలోనైనా విజయం సాధించడానికి కొంత సమయం పట్టినప్పటికీ, కచ్చితంగా గొప్ప స్థాయికి చేరుకుంటారు. వీరికి  తెలుపు, పసుపు,ఆకుపచ్చ రంగులు కలిసి వస్తాయి. 

ములాంక్ 9  : ఏ నెలలో అయినా  9, 18, లేదా 27వ తేదీలలో జన్మించిన వారికి మూలాంక్​ 9  వర్తిస్తుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ సంఖ్యకు కుజుడు  అధిపతి. వీరు పుట్టుకతోనే నాయకులు, అద్భుతమైన ధైర్యం ,ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఏ పనిలోనైనా వెనకడుగు వేయకుండా, సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగుతారు. తోటివారికి సహాయం చేయడంలో ముందుంటారు. కేవలం డబ్బు కోసమే కాకుండా సమాజంలో ఒక మంచి గుర్తింపు, ప్రభావం చూపాలని ఆరాటపడతారు. వీరికి ఎరుపు, గులాబీ రంగులు కలిసి వస్తాయి. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.