నీళ్లతో కడిగినప్పుడు అరచేతులు చల్లగా అయిపోతాయి. అప్పుడు ఏ పని చేయాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు కాసేపు ఈ వార్మర్లను పట్టుకుంటే క్షణాల్లో వేడెక్కుతాయి. వీటిని ఒకూపా అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇవి కేవలం మూడు సెకన్లలో వేడిని విడుదల చేస్తాయి. ఇది 3 టెంపరేచర్ సెట్టింగ్స్‌తో వస్తుంది. అంతేకాదు.. ఇందులో ఉన్న ఏఐ స్మార్ట్ చిప్ నిమిషానికి 1200 సార్లు టెంపరేచర్లను చెక్ చేసి.. ఓవర్ హీటింగ్, షార్ట్ సర్క్యూట్ లాంటి సమస్యలను నివారిస్తుంది.
ఈ వార్మర్స్‌కి అయస్కాంత లక్షణాలు కూడా ఉంటాయి. అంటే.. వాటిని సులభంగా ఒకదానితో ఒకటి అటాచ్ చేసుకోవచ్చు, విడదీయొచ్చు. వీటికి యూఎస్‌బీ సీ కేబుల్‌తో చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒకసారి ఫుల్ చార్జ్ చేయడానికి మూడు గంటలు పడుతుంది. ఫుల్ చార్జ్ చేశాక పన్నెండు గంటలపాటు పనిచేస్తాయి. వీటి బరువు కూడా చాలా తక్కువ.
