
గతంలో ఏ పని మొదలు పెట్టినా క్షణాల్లో అయిపోయోది. బాస్ చెప్పిన సమయం కంటే ముందే వర్క్‌ను కంప్లీట్ చేసి ఆయన టేబుల్‌పై పెట్టేవాడిని.. అయితే ఈ మధ్య కాలంలో సీటు మారింది.. అప్పటి నుంచి పని సరిగా చేయలేకపోతున్నాను. ఆఫీసులో కూడా ఈస్ట్.. నార్త్.. అని వాస్తు ఉంటుందా.. ఈ విషయంలో వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు ఏమంటున్నారో చూద్దాం. . .
ప్రశ్న: నేను ఇటీవల ఆఫీసులో సీటు మారాను. అప్పటి నుంచి పని మీద మనసు పెట్టలేకపోతున్నా. ప్రమోషన్ మిస్సయింది. మా ఆఫీసు ఎంట్రన్స్ తూర్పు వైపు ఉంటుంది. పడమర, ఉత్తరం రోడ్లు ఉన్నాయి. నేను ఆగ్నేయంలో తూర్పుముఖం పెట్టి కూర్చుంటున్నా ఆఫీసుకు కూడా ఈస్ట్, వెస్ట్ ఉంటుందా? నా సీటు ఏ వైపుకు మార్చుకోమంటారు?
జవాబు: ఇంటికే కాదు ఆఫీసుకు వాస్తు ఉంటుంది. ఆఫీసు యాజమాన్యానికి, ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. మీరు ఆగ్నేయంలో ఉన్న సీటుకు మారారు. అందుకే, సమస్యలు వస్తున్నాయి. నైరుతిలో తూర్పు ముఖం పెట్టి కూర్చుంటే మీకు మంచిది. ఆఫీసు ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి.. నైరుతిలో ఉత్తరంవైపు ముఖం పెట్టి కూర్చున్నా ఫర్వాలేదు. ఒక వారం రోజులు అలా కూర్చొని చూడండి.
ప్రశ్న: మేం కొత్త బీరువా కొన్నాం. హాల్లో... నైరుతిమూల పెట్టుకోమని చెప్తున్నారు. కానీ, అక్కడ స్థలం లేదు. బీరువా ఏ వైపు. ఏ అభిముఖంగా పెట్టుకోమంటారు?
జవాబు: బీరువా బెడ్ రూం, హాల్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. హాల్ నైరుతిలో స్థలం లేకపోతే బెడ్రూం నైరుతిలో ఈస్ట్ లేదా నార్త్ ఫేసింగ్ ఉండేలా పెట్టుకోండి. అలా కుదరకపోతే హాల్లో దక్షిణం గోడకు నార్త్ ఫేసింగ్ పెట్టుకోవచ్చు..