Pawan Kalyan: 'ఓజీ 2' రీలోడెడ్: గన్ పట్టి మళ్లీ వస్తున్న 'ఓజాస్ గంభీర'.. సుజీత్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!

Pawan Kalyan: 'ఓజీ 2' రీలోడెడ్: గన్ పట్టి మళ్లీ వస్తున్న 'ఓజాస్ గంభీర'.. సుజీత్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ హిస్టరీని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ డ్రామా  'ఓజీ' (They Call Him OG) ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. సుజీత్ టేకింగ్, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్స్ తో థియేటర్లను రణరంగంగా మార్చేశాయి. వరల్డ్‌వైడ్‌గా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి, పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా రికార్డు క్రియేట్ చేసింది.

'ఓజీ 2' రీలోడెడ్

సెప్టెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం క్లైమాక్స్‌లో వదిలిన హింట్స్‌తో పార్ట్-2పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉండటం, సినిమాలకు తాత్కాలిక బ్రేక్ ఇవ్వడంతో ‘OG 2’ ఉంటుందా లేదా? అని కంగారుపడ్డ ఫ్యాన్స్‌కు ఇప్పుడొక మైండ్ బ్లోయింగ్ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఫ్యాన్స్ ఆందోళనలకు చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సోషల్ మీడియా వేదికగా ఒక అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

'మాటిచ్చినట్టుగానే ఆయన వస్తున్నారు! ఆ సమయం ఏంటనేది ఆయనే చెప్తారు. డైరెక్టర్ సుజీత్ ఫారెన్ ట్రిప్ నుండి తిరిగి రాగానే 'OG 2' చర్చలు మొదలవుతాయి అని ఎక్స్ లో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పోస్ట్ చేసింది. ఈ ఒక్క పోస్ట్‌తో సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ఈ హిట్‌తో పవన్ కళ్యాణ్‌లో కూడా యాక్టింగ్ పట్ల సరికొత్త ఉత్సాహం పెరిగిందని స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు.

 

ప్రీక్వెల్, సీక్వెల్స్ హంగామా..

మొదట్లో త్రివిక్రమ్ ద్వారా సుజీత్ పరిచయమైనప్పుడు, జపనీస్ దుస్తులలో కత్తి పట్టుకుని ఉండే గ్యాంగ్‌స్టర్ పాత్ర అంటే పవన్‌కు పెద్దగా అర్థం కాలేదట. కానీ నా కొడుకు (అకీరా) ఈ స్క్రిప్ట్ నోట్స్ చదివి ఎగ్జైట్ అవ్వడం చూశాకే.. ఇది యూత్‌కు ఎంత కనెక్ట్ అవుతుందో తెలిసింది" అని పవన్ స్వయంగా చెప్పారు.ఈ చిత్రంతోనే బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్‌లోకి విలన్‌గా పవర్‌ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా మెప్పించింది.

లేటెస్ట్ సమాచారం ప్రకారం, కేవలం సీక్వెల్ మాత్రమే కాదు.. 'OG' కి ఒక మైండ్ బెండింగ్ ప్రీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారట. అంటే 'OG యూనివర్స్' మరింత విస్తరించబోతోంది.  డివివి దానయ్య భారీ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ పార్ట్-2లో అంతకుమించి ఉండబోతున్నాయి. మరి'OG' బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలనిజం, ప్రియాంక మోహన్ క్యూట్‌నెస్ ఆకట్టుకున్నాయి. మరి ఈ ఓజీ 2లో వీరు ఉంటారో లేదో తెలియాల్సి ఉంది.,

ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నా, తన వింటేజ్ లుక్‌తో ఫ్యాన్స్‌ని ఊపేయడానికి పవర్ స్టార్ టీం మళ్లీ రెడీ అవుతోంది. 'OG 2' లో అంతకుమించిన యాక్షన్ సీక్వెన్సులు, ఊహించని ట్విస్టులు ఉండబోతున్నాయట. మొత్తానికి 'ఓజాస్ గంభీర' మళ్లీ గన్‌ పట్టుకుని థియేటర్లలో విధ్వంసం సృష్టించడానికి వస్తున్నాడు.