టెహ్రాన్: ఇరాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. టెహ్రాన్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్దిష్ నగరం సనందజ్ సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. హమదాన్ నుంచి మరివాన్ వైపు వెళ్తున్న ఈ ట్యాంకర్ అదుపుతప్పి ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
