సూర్యాన్ష్ హీరోగా గణేష్ పూడి దర్శక నిర్మాతగా రూపొందిన చిత్రం ‘ఒక కోర్టు కేస్’. జులై 17న సినిమా విడుదల కానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సూర్యాన్ష్ మాట్లాడుతూ ‘ఇదొక స్పెషల్ ఫిల్మ్. కథ వినగానే కొత్తగా అనిపించింది. తనకు జరిగిన మోసానికి వ్యతిరేకంగా ఒక యువకుడు కోర్టులో చేసే పోరాటమే ఈ చిత్రం’ అని చెప్పాడు.
దర్శక నిర్మాత గణేష్ పూడి మాట్లాడుతూ ‘ప్రేమలో మోసపోయిన ఒక వ్యక్తి న్యాయం కోసం లీగల్‌గా ఎలాంటి పోరాటం చేశాడు అనేదే ఈ సినిమా కథ. ముఖ్యంగా బ్రేకప్ తర్వాత జరిగే ప్రతీకారం అనే సరికొత్త కోణాన్ని ఇందులో వినోదాత్మకంగా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో చూపించబోతున్నాం’ అని అన్నాడు.
