తీన్మార్ బ్యాండ్ మోతలో..నితిన్, శ్రీలీల ఓలే ఓలే మాస్ స్టెప్పులు

తీన్మార్ బ్యాండ్ మోతలో..నితిన్, శ్రీలీల ఓలే ఓలే మాస్ స్టెప్పులు

టాలీవుడ్ హీరో నితిన్(Nithin) నటించిన ఎక్స్ట్రా ఆర్డినరి మ్యాన్ అనే సినిమా..డిసెంబర్ 8న థియోటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ తో పాటు సాంగ్స్ కూడా హైలెట్ గా నిలిచాయి. ఈ మూవీలో నితిన్ కు జోడిగా శ్రీ లీల(Sreeleela) నటించింది. 

లేటెస్ట్గా ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ (Ole Ole Paapaayi) లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఓలే ఓలే పాపాయి..పలాసాకే వచ్చేయ్..ఎర్ర ఎర్ర ఎర్రగున్న ఎర్రమీనురో..జర్ర జర్ర జారిపోయే కుర్రమీనురో..అదిరిపోయే ఈ మాస్ సాంగ్కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. జానీ మాస్టర్ కోరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్ను రామ్ మిరియాల,ప్రియా హేమేష్ పాడారు.

ఈ పాటలో నితిన్ శ్రీలీల మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. నితిన్ ప్రతి సినిమాలో కూడా తనదైన డాన్స్తో డిఫరెంట్గా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక అతనికి శ్రీలీల స్టెప్పులు తోడవ్వడంతో..వీరి కలయికకు థియేటర్స్లో మాస్ విజిల్స్ పడిపోవడం కన్ఫమ్ అనిపిస్తోంది. ఇక ఈ పాటలో నితిన్ ,శ్రీ లీల డ్రెస్సింగ్ స్టైల్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒకపక్క తీన్మార్ బ్యాండ్ మోత మోగుతుంటే..ఇంకోపక్క శ్రీ లీల కిర్రాక్ మాస్ స్టెప్స్తో అదరగొడుతుంటే..థియేటర్లో ఫాన్స్కి పూనకాలు లోడింగే..అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. 

వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్, రుచిర ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ సంస్థలు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.