మరోసారి గృహ నిర్బంధంలో ఒమర్ అబ్దుల్లా

మరోసారి గృహ నిర్బంధంలో ఒమర్ అబ్దుల్లా

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాను మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్‌‌ ద్వారా తెలిపారు. తనతోపాటు తండ్రి ఫారుక్ అబ్దుల్లాను, మొత్తం కుటుంబాన్ని ఇంట్లో నిర్బంధించారని ఒమర్ ట్వీట్ చేశారు. తన ఇంటి ముందు పోలీసుల వాహనాలు ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘2019, ఆగస్టు తర్వాత ఏర్పడిన కొత్త జమ్మూ కశ్మీర్ ఇదే. ఎలాంటి వివరణ ఇవ్వకుండా మమ్మల్ని మా ఇంట్లో నిర్బంధించారు. నా తండ్రి (సిట్టింగ్ ఎంపీ)తోపాటు చెల్లి, తన పిల్లలను కూడా ఇంట్లోనే లాక్ చేశారు’ అని అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఎలాంటి వివరణ ఇవ్వకుండా తమను నిర్బంధించడమే కొత్త ప్రజాస్వామ్య మోడల్‌‌లా ఉందంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు.