హ్యాపీ బర్త్డే రితికా: షేర్ లాంటి నీ ధైర్యం..ప్రతి అమ్మాయికి ఇన్స్పిరేషన్!

హ్యాపీ బర్త్డే రితికా: షేర్ లాంటి నీ ధైర్యం..ప్రతి అమ్మాయికి ఇన్స్పిరేషన్!

గురు సినిమాలో రితికా సింగ్ (RitikaSingh)ను ఇష్టపడని వారు ఉండరేమో. తన నటనతో అంతలా ప్రేక్షకులను ఈ బ్యూటీ కట్టి పడేసింది. తన నిజ జీవితంలో..ఆడపిల్ల అని చులకన చూసే పద్దతులను కాలుతో తన్ని..ఒట్టి మాటలను చెత్త బుట్టలో వేసి..మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణిగా కెరీర్ స్ట్రాంగ్ చేసుకుంది. 

ఆడపిల్లలు షేర్ లెక్కా ఉండాలే..తమలో ఆత్మ విశ్వాసం పెరగాలే..అనే మాటలు ఎంతలా గ్రహిస్తే..ఒక ఆటలో ఆడటానికి వెనకడుగు వేయకుండా బరిలో నిలబడగలదు ఊహించండి. అలాంటిది రితికా సింగ్ 2009లో భారత దేశం తరపున ఆసియన్ ఇండోర్ గేమ్స్ మరియు సూపర్ ఫైట్ లీగ్ పోటీల్లో పాల్గొన్న లేడీ లయన్గా సత్తా చాటింది. ఇవాళ (డిసెంబర్ 16) తన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ విషెస్ చెబుతున్నారు.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ritika Singh (@ritika_offl)

ఇక సోషల్​మీడియాలో రితికాను ఫాలో అయ్యేవారి సంఖ్య భారీ గానే ఉంది. బాక్సర్​ అయిన రితికా ఫిట్నెస్​ వీడియోలతోనూ ఆకట్టుకుంటుంది. రితికా సింగ్ సినిమాల విషయానికి వస్తే..ఆండవన్ కోమండి, శివలింగ, ఓ మై గాడ్, కోలా,హత్య మూవీస్లో నటించింది. ప్రస్తుతం రజినీకాంత్ 170వ మూవీలో విభిన్నమైన రోల్లో నటిస్తోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ritika Singh (@ritika_offl)