ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం మూవీ కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం మూవీ కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

మిన్నల్ మురళి, 2018 లాంటి సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపును అందుకున్నాడు మలయాళ హీరో టోవినో థామస్. అతను హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం’. జితిన్ లాల్ దర్శకుడు. కృతిశెట్టి మలయాళ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ కీలక పాత్ర పోషిస్తోంది. ఎనిమిది నెలల క్రితం ఆరు భాషల్లో టీజర్ విడుదల చేసిన మేకర్స్... ఆదివారం హీరో టోవినో థామస్ బర్త్‌‌‌‌‌‌‌‌ డే సందర్భంగా విషెస్ చెబుతూ కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.

ఇందులో మణియన్, అజయన్, కుంజికేలుగా మూడు పాత్రల్లో   నటిస్తున్న టోవినో.. పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడు డిఫరెంట్ గెటప్స్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తున్నాడు. భూమి, గాలి, నీరు, నిప్పు,  ఆకాశం అనే పంచభూతాల  నేపథ్యంలో సాగే మూడు యుగాల కథ ఇదని, ఖగోళ రహస్యం బ్యాక్ డ్రాప్‌‌‌‌‌‌‌‌లో విజువల్ వండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుందని చెబుతున్నారు మేకర్స్.