వన్‍ప్లస్ 11.. కొత్త లుక్ లో

వన్‍ప్లస్ 11.. కొత్త లుక్ లో

ఆండ్రాయిడ్ మొబైల్స్ లో తనకంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకున్న వన్‍ప్లస్,  ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్స్ తో వన్‍ప్లస్ 11 ఫోన్ ను తీసుకురాబోతోంది. సాండ్ స్టోన్ ఫినిష్ (బ్లాక్), గ్రీన్ కలర్స్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో రాబోతుంది. హసల్ బ్లేడ్ భాగస్వామ్యంతో సర్కిల్ లుక్ లో కర్వ్డ్ కెమెరా డిజైన్ తో రాబోతుంది. 

6.7 అంగులాల క్యూ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 50 ఎంపీ మెయిన్ కెమెరాయే ఇందులో హైలైట్ ఫీచర్స్. 100 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేసే ఈ ఫోన్, వైర్లెస్ చార్జింగ్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మోడల్ లో వన్‍ప్లస్ 11 ప్రో వేరియెంట్ ఉండబోదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 7న ఈ ఫోన్ తో పాటు వన్‍ప్లస్ బడ్స్ ప్రో 2 ని కూడా లాంచ్ చేయనున్నారు.