
- బెట్టింగ్ యాప్స్.. ప్రమోట్ చేస్తున్న ముఠా అరెస్ట్
- పోలీసుల అదుపులో నలుగురు ఇన్ఫ్లుయెన్సర్లు
- పరారీలో మరో ముగ్గురు
- ఒక్కొక్కరు రూ. 50 లక్షల వరకు సంపాదన
హైదరాబాద్: బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. కమీషన్లు ఆర్జిస్తున్న నలుగురు ఇన్ ఫ్ల్యూయెన్సర్లను సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. టెలిగ్రామ్, ఇన్ స్టాగ్రామ్ లో మ్లో నిందితులు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నట్టు గుర్తించారు.
నిందితులకు 10వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. బెట్టింగ్ వల్ల ఓ యువకుడు నష్టపోయి సూసైడ్ చేసుకున్నాడు. కమీషన్ తో ఒక్కొక్కరు రూ.50ల క్షలు సంపాదించినట్టు గుర్తించారు. 2019 నుంచి వీరు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారు. 10 విదేశీ వెబ్ సైట్లను నిందితులు ప్రమోట్ చేస్తున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నాం' అన్నారు డిసీసీ సాయి శ్రీ.
ఆన్ లైన్ బెట్టింగ్ బెట్టింగ్ ను ప్రోత్సహిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నట్టు డీసీపీ సాయి శ్రీ తెలిపారు. జూన్ 13న మియాపూర్ నివాసి ఇచ్చిన కంప్లయింట్ తో రంగంలోకి దిగిన పోలీసులు ముఠా గుట్టు రట్టు చేశారు. టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా తనను , తన స్నేహితుడిని వరుసగా రూ.50 లక్షలు , రూ.60 లక్షలు మోసం చేశారని, “టాస్ ఫిక్స్ హామీ ఇచ్చారని” అని బాధితుడు పోలీసులకు చెప్పారు.
నిందితులు ఎవరికి చిక్కకుండా తెలివిగా డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి మోసం చేస్తూ.. 13శాతం కమిషన్ తీసుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దందాతో - రూ. 80 లక్షలు అక్రమంగా సంపాదించినట్టు తెలిపారు. నిందితులు రాకేష్ రూ.1.7 కోట్లు, దీపక్ రూ.55 లక్షలు, నాయక్ రూ.30 లక్షలు, హేమంత్ రూ.20 లక్షల లాభం పొందారు.
నిందితులు టెలిగ్రామ్ ఖాతాలను సృష్టించి క్రికెట్ మ్యాచ్‌లపై ప్రత్యేకమైన ఇన్‌సైడర్ చిట్కాలను అందిస్తూ ఫిక్స్‌డ్ మ్యాచ్‌లను యాక్సెస్ చేసేవారని పోలీసులు తెలిపారు. బాధితులు మ్యాచ్‌లపై పందెం కాస్తే UPI ద్వారా మ్యూల్ ఖాతాలకు డబ్బును బదిలీ చేయమని అడిగారు. నకిలీ ఆధార్ ,పాన్ కార్డులను ఉపయోగించి ఈ ఖాతాలను తెరిచారని పోలీసులు తెలిపారు.
నిందితులు నడిపిన బెట్టింగ్ యాప్ లు ఇవే..
- www.stakeid.com
- www.lotusplay247.com
- www.royalbook365.com
- www.govinda365.io
- www.VIPBook.com
- www.Fairplay.com
- www.Lotusexchange.com
- www.winbuzz.com
- www.ultrawin.com
- 10.www.ultrawin.games