
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ ఊరి పేరు భైరవకోన(Ooru Peru Bhairavakona). విలక్షణ దర్శకుడు విఐ ఆనంద్(VI Anand) తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ వర్ష బోళ్ళమా(Varsha Bollama) హీరోయిన్ గా నటించారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యిందని. అయితే రిలీజ్ కు రెండు రోజుల ముందే(ఫిబ్రవరి 14) పేయిడ్ ప్రీమియర్స్ వేశారు మేకర్స్. మరి.. ఈ సినిమా ఎలా ఉంది? సందీప్ కిషన్ కు హిట్టు పడిందా? సినిమా చూశాక ఆడియన్స్ ఏమంటున్నారు అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
బసవ( సందీప్ కిషన్) అతని ఫ్రెండ్ జాన్ ( వైవా హర్ష) ఇద్దరు దొంగలు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. బసవకు భూమి(వర్ష బోళ్ళమా) అంటే చాలా ఇష్టం. ఒకసారి దొంగతనం చేసి పారిపోతున్న సమయంలో అనుకోకుండా భైరవకోన ఊరికి వస్తారు. వీరితో పాటు గీత ( కావ్య థాపర్) కూడా అనుకోకుండా భైరవకోనలోకి వస్తుంది. అక్కడ వారికి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. మిగతా ఊళ్ళ కంటే భైరవకొనలో పరిస్థితులు చాలా భిన్నంగా, భయానకంగా ఉంటాయి. మరి మిగతా ఊర్లకి భైరవకోనకి ఉన్న తేడా ఏంటి? ఆ ఊరి గురించి గరుడ పురాణంలో ఏం చెప్పారు.? ప్రేమించిన అమ్మాయి కోసం బసవ ఎందుకు దొంగగా మారాడు? అనేది ఊరు పేరు భైరవకోన మిగతా కథ.
విశ్లేషణ:
తెలుగు సినిమా కథల్లో ముఖ్యంగా ఉండాల్సింది ఎమోషన్. ఎమోషన్ లేకుండా, అది ఆడియన్స్ కు కనెక్ట్ అవకుండా హిట్టైన దాఖలాలు లేవు. ఎంత ఫాంటసీ మూవీ అయినప్పటికి ఆడియన్స్ మెయిన్ గా కెనెక్ట అయ్యేది కథలోని ఎమోషన్ కే. అది వర్కౌట్ అయితే ఆ సినిమాను ఎవరు ఆపలేరు. అదే ఊరు పేరు భైరవకోన విషయంలో కూడా రిపీట్ అయ్యింది. సినిమా సూపర్ కంటెంట్ ఉంది కానీ, ఆడియన్స్ ను కనెక్ట్ చేసే ఎమోషనే మిస్సయింది అనిపిస్తుంది.
సినిమా ప్రారంభం మామూలుగానే సాగినా.. భైరవకోన లోకి ఎంట్రీ ఇచ్చాక అసలు కథ మొదలవుతుంది. భైరవకోన, అక్కడ మనుషులు, వారి వింత ప్రవర్తన,ఇంటర్వెల్ ట్విస్ట్ వరకు చాలా ఎంగేజింగ్ గా, మంచి ఫాంటసీ అడ్వెంచర్ మూవీ చూస్తున్నాము అనే ఫీలింగ్ కలుగుతుంది. అక్కడక్కడ వైవా హర్షా, వెన్నల కిషోర్ కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. అయితే.. అసలు ట్విస్ట్ రివీల్ అయ్యాక లాజిక్స్ కి దూరంగా వెళ్ళిపోతుంది సినిమా. ఇక సెకండ్ హాఫ్ లో ఊహించని ట్విస్టులు, అవి రివీల్ చేసిన విధానం కూడా బాగానే ఉంది. కానీ, చాలా వరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారని అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్, హీరోయిన్ ట్విస్ట్ కూడా బాగానే సెట్ చేశారు. ఓవర్ ఆల్ గా లాజిక్స్ చూడకుండా, కేవలం సినిమాగా చూస్తే మాత్రం చాలా నచుతుంది.
నటీనటుల:
హీరో సందీప్ కిషన్ గురించి చెప్పాలంటే ఇది అతని వన్ మ్యాన్ షో. ఈ సినిమా కోసం సందీప్ చాలా కష్టపడ్డారు. ప్రతీ ఫ్రెమ్ లో అది క్లియర్ గా కనిపిస్తుంది. ఇక వర్ష బోల్లమ్మ భూమిగా తన క్యూట్ నటనతో ఆకట్టుకుంది. కావ్య థాపర్ కి కూడా ఈ సినిమా మంచి పాత్ర దొరికింది. ఇక వైవా హర్ష, వెన్నెల కిషోర్ ఎప్పటిలాగే తమ కామెడీతో ఆడియన్స్ ను నవ్వించారు. ఇక మిగతా నటీనటులు కూడా పాత్ర మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు:
ఊరి పేరు భైరవకోన సినిమాకు ప్రధాన బలం అంటే శేఖర్ చంద్ర మ్యూజిక్ అనే చెప్పాలి. పాటలు ఎంత బాగా ఇచ్చాడో.. బిజీఎం కూడా అదే రేంజ్ లో ఇచ్చాడు. తన డివోషనల్ మ్యూజిక్ తో సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాడు. ఇక ఎడిటింగ్, కెమెరా వర్క్ కూడా ఆకట్టుకుంటాయి. ఇక దర్శకుడు వి.ఐ. ఆనంద్ గురించి చెప్పాలంటే..తాను ఎంచుకున్న కథను అనుకున్నట్టుగా తెరకెక్కించడంలో పాస్ అయ్యాడు. కొన్ని సన్నివేశాలు లాజిక్ మిస్ అయినా సినిమా ఫ్లోలో అవి పెద్దగా గుర్తుండవు.
ALSO READ :- నాకు నమ్మకముంది.. 2024 టీ20 వరల్డ్ కప్ రోహిత్ కెప్టెన్సీలో గెలుస్తాం: జైషా
ఇక మొత్తంగా చెప్పాలంటే ఊరి పేరు భైరవకోన.. ఫాంటసీ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ కు మంచి ఫీల్ ఇస్తుంది.