ఫిబ్రవరి 16న ఊరు పేరు భైరవకోన

ఫిబ్రవరి 16న ఊరు పేరు భైరవకోన

సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించారు. బాలాజీ గుత్తా కో ప్రొడ్యూసర్. ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే ‘ఈగల్’ చిత్రం కోసం  తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీస్తున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ, నిర్మాతలు రిలీజ్‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌ను మార్చారు. ఓ వారం ఆలస్యంగా, అంటే ఫిబ్రవరి 16న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ ఆకట్టుకుంది. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. భాను భోగవరపు, నందు సవిరిగాన డైలాగ్స్ రాశారు.