ఆర్టీసీలో టెంపరరీ డ్రైవర్, కండక్టర్లకు అవకాశం

ఆర్టీసీలో టెంపరరీ డ్రైవర్, కండక్టర్లకు అవకాశం

నిజామాబాద్ వెలుగు : ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో టెంపరరీ డ్రైవర్లు, కండక్టర్లకు అవకాశం కల్పిస్తున్నట్లు రీజినల్ మేనేజర్ సోలమన్ తెలిపారు. డ్రైవర్లకు18 నెలల కంటే ఎక్కువ ట్రాన్స్‌ పోర్ట్ హెవీ వెహికిల్ లైసెన్స్ ఉండాలని, కండక్టర్లు టెన్త్‌‌ పాసై ఉండాలని చెప్పారు. వీరు ఆధార్‌ కార్డు, సర్టిఫికెట్లతో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు రీజనల్‌ మేనేజర్‌ ఆఫీస్‌ లో రిపోర్ట్‌‌ చేయాలన్నారు. డెయిలీ వేజేస్‌ పద్ధతిన డ్రైవర్‌ కు రోజుకు రూ.1500, కండక్టర్‌ కు రూ. 1000 చొప్పున ఇస్తామన్నారు.

గతంలో ఆర్టీసీలో పని చేసి రిటైర్ అయిన సూపర్‌ వైజర్, మెకానిక్ క్లర్క్‌ ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. సూపర్​వైజర్లకు రోజుకు రూ.1500, మెకానిక్, క్లర్కుకు రోజుకు రూ. 1000 చొప్పున ఇస్తామన్నారు.