ఒక్క జ్ఞానేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం సొంత ప్రజలపై  మోదీ, షా యుద్ధం

 ఒక్క జ్ఞానేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం సొంత ప్రజలపై  మోదీ, షా యుద్ధం

 

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నరు: దీప్కే
బీజేపీ అసలు లక్ష్యం ‘ఒక దేశం.. ఒక పార్టీ’  
ప్రముఖుల ఓట్లు పోవడమే సర్​
వైఫల్యానికి నిదర్శనం: ప్రకాశ్​ రాజ్
దేశంలో ప్రభుత్వ మార్పు అత్యవసరం: ప్రశాంత్ భూషణ్

 

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ సొంత దేశ ప్రజలపైనే యుద్ధం చేస్తున్నారని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రక్షించడానికే కేంద్రం తన అధికారాలను, ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ దేశంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని ఫైర్ అయ్యారు.  గురువారం ఆయన ఢిల్లీలో నటుడు ప్రకాష్ రాజ్, ఐసా ప్రెసిడెంట్ నేహా బోరాతో కలిసి మీడియాతో మాట్లాడారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న యువతను, ప్రతిపక్ష నాయకులను పోలీసులు రోడ్లపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని దీప్కే తెలిపారు. ఒక్క జ్ఞానేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాపాడటానికి నేహా బోరాను, అయేషాను, విలాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, ఇషాను పోలీసులు ఈడ్చుకెళ్లి  అన్యాయంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాను అక్రమంగా నిర్బంధించి తీహార్ జైలుకు పంపారన్నారు.

ఈసీ తీరుపై అనుమానాలు సహజమే

ఈ సందర్భంగా ఎన్నికల సంఘం పనితీరుపై, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియపైనా దీప్కే సందేహాలు వ్యక్తం చేశారు. గత లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమికి, ప్రతిపక్ష ఇండియా కూటమికి మధ్య 2 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉన్నందున ఈసీపై అనుమానాలు వచ్చాయన్నారు. సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. బతికి ఉన్నప్పటికీ కొందరిని మరణించినట్లు చూపారని, అలాంటి బాధితులను తాను  కలిశానని వివరించారు. జ్ఞానేశ్ ను కాపాడేందుకే మోదీ సర్వశక్తులను ఒడ్డుతున్నారని దీప్కే పేర్కొన్నారు. 

ఒకే దేశం.. ఒక పార్టీనే బీజేపీ లక్ష్యం 

దేశంలో ప్రజాస్వామ్యాన్ని, గొంతుకలను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని దీప్కే విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ‘ఒక దేశం.. ఒక ఎన్నిక’ అనేది కేవలం ఒక నినాదం మాత్రమేనని.. వారి అసలు లక్ష్యం దేశంలో ‘ఒక దేశం, ఒక పార్టీ’ విధానమని విమర్శించారు. దమ్ముంటే దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించాలని మోదీకి దీప్కే సవాల్ విసిరారు. ఎన్డీయే అరాచక పాలనను ప్రజలందరూ ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

అక్రమాలను తుడిచిపెట్టేందుకే సర్: ప్రకాష్ రాజ్ 

గత ఎన్నికల అక్రమాలను తుడిచిపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం సర్ ప్రక్రియను తెచ్చిందని నటుడు ప్రకాష్ రాజ్ ఆరోపించారు. సర్ ప్రక్రియలో జరిగిన అన్యాయాలు, లోపాలపై విచారణ జరిపేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి ఒక ప్రత్యేక స్వతంత్ర కమిటీ (ప్యానెల్) ఢిల్లీలో బహిరంగ విచారణను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్.. కమిటీ విచారణ వివరాలను  మీడియాకు వివరించారు. ఓట్లు కోల్పోయిన బాధితుల డేటాను సమర్పించామని తెలిపారు. ఐదుసార్లు జాతీయ అవార్డులు పొందిన తన పేరుతో పాటు, మాజీ సీజేఐ చంద్రచూడ్, పలువురు ముఖ్యమంత్రుల పేర్లు కూడా జాబితా నుంచి తొలగించడమే ఈ ప్రక్రియ వైఫల్యానికి నిదర్శనమన్నారు. 

ప్రభుత్వ మార్పు అత్యవసరం: ప్రశాంత్ భూషణ్​ 

దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ప్రభుత్వ మార్పు (రిజీమ్ ఛేంజ్) అత్యంత అవసరమని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు. ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడటమే తమ పోరాటమని, కేంద్ర ప్రభుత్వ దమనకాండ ఇలాగే కొనసాగితే దేశంలో కచ్చితంగా ప్రభుత్వ మార్పు జరిగి తీరుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ మార్పును కోరుకోవడం ప్రతి పౌరుడి ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు అని, ప్రభుత్వంపై అసంతృప్తిని తెలియజేయడం నేరం కాదని గుర్తుచేశారు.