Weekend OTT Watchlist: ఓటీటీలో వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్.. రెండు రోజుల్లోనే 30కి పైగా కొత్త చిత్రాలు.. వాచ్‌లిస్ట్ ఇదే!

Weekend OTT Watchlist: ఓటీటీలో వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్.. రెండు రోజుల్లోనే 30కి పైగా కొత్త చిత్రాలు.. వాచ్‌లిస్ట్ ఇదే!

వీకెండ్ వచ్చేస్తోందంటే చాలు.. ఓటీటీ ప్రియుల కళ్లు సరికొత్త సినిమాల కోసం వెతుకుతుంటాయి. అందుకు తగ్గట్టుగానే  జూన్ 4 నుండి జూన్ 5 వరకు నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, జీ5, సోనీ లివ్ వంటి టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అన్నీ సరికొత్త సినిమాలతో, క్రేజీ వెబ్ సిరీస్‌లతో థియేటర్లను తలపించేలా ఊరమాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు ప్లాన్ చేశాయి.

 యాక్షన్, క్రైమ్, రొమాన్స్, మిస్టరీ, హారర్.. ఇలా అన్ని జోనర్లలో కలిపి మొత్తం ఈ రెండు రోజుల్లోనే30 కి పైగా సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. జూన్ 4న బ్లాక్‌బస్టర్స్ & ఫ్యామిలీ క్రైమ్ డ్రామాస్  స్ట్రీమింగ్ కు రెడీ అయ్యాయి. వాటిల్లో బాలీవుడ్ భారీ సినిమాలు, హాలీవుడ్ సూపర్ హిట్ సీక్వెల్స్ లైన్ కట్టాయి.

జియోహాట్‌స్టార్ (JioHotstar)

ధురంధర్: ద రివెంజ్ (JioHotstar): రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో థియేటర్లలో రూ.1,850 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారీ యాక్షన్ బ్లాక్‌బస్టర్ ఇది. కరాచీ అండర్‌వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా జూన్ 4 రాత్రి నుంచే స్ట్రీమింగ్ కానుంది. అయితే  రేపు ( జూన్ 4న) 'జియోహాట్‌స్టార్' (JioHotstar) లో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో కేవలం నార్మల్ వెర్షన్ లా కాకుండా ‘Raw & Undekha’ పేరుతో ఎక్స్‌క్లూజివ్ అదనపు ఫుటేజ్, కట్ చేయని బోల్డ్ అండ్ రా సీన్స్‌తో వస్తుండటంతో డిజిటల్ ఆడియన్స్‌లో హైప్ స్కై-హై లెవెల్‌కి చేరింది.

 

నెట్ ఫ్టిక్స్ ( Netflix )

మా బెహెన్ (Netflix): మాధురీ దీక్షిత్, త్రిప్తి డిమ్రి, ధర్నా దుర్గ ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ ఫ్యామిలీ క్రైమ్ డ్రామా. కిచెన్‌లో దొరికిన శవాన్ని దాచడానికి ఒక తల్లి, ఇద్దరు కూతుళ్లు పడే పాట్లు నవ్వులు పూయిస్తూనే థ్రిల్ ఇస్తాయి. (తెలుగు ఆడియో ఉంది).

 

29 ద మూవీ (Netflix): లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజు సంయుక్తంగా నిర్మించిన తమిళ్ రొమాంటిక్ కామెడీ సినిమా. థియేటర్లలో మిస్ అయిన ఈ సినిమా తెలుగు, హిందీతో పాటు 5 భాషల్లో వస్తోంది.

 

ట్విస్టర్స్, ద నన్ 2, మెగ్ 2: ద ట్రెంచ్, గొడ్జిల్లా X కాంగ్: ద న్యూ ఎంపైర్ వంటి చిత్రాలు నెట్‌ఫ్లిక్స్ లో జూన్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. హాలీవుడ్ లవర్స్ కోసం ఒకేరోజు నాలుగు భారీ విజువల్ వండర్ సినిమాలు ఇంగ్లీష్‌తో పాటు ప్రాంతీయ భాషల్లో విడుదలవుతున్నాయి.

ఇక జూన్ 5 , శుక్రవారం ఒక్కరోజే టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్‌కు చెందిన మోస్ట్ అవైటెడ్ సినిమాలు, సిరీస్‌లు ఏకకాలంలో  మొత్తం 20 కి పైగా స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

అమెజాన్ ప్రైమ్ వీడియో ( Amazon Prime Video )

ద పిరమిడ్ స్కీమ్ :  రణవీర్ శోరే, శేఖర్ సుమన్ నటించిన ఈ సిరీస్ మార్కెటింగ్ స్కామ్స్, మిడిల్ క్లాస్ ఆశల చుట్టూ తిరిగే గ్రిప్పింగ్ డ్రామా' ద పిరమిడ్ స్కీమ్' . ఇది జూన్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియలో స్ట్రీమింగ్ కానుంది.

డెకాయిట్ : అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ 'డెకాయిట్: ఏక్ ప్రేమ్ కథ' హిందీ వర్షన్ జూన్ 5న వస్తోంది. సౌత్ వర్షన్స్ ఆల్రెడీ ట్రెండింగ్‌లో ఉన్నాయి.

 

గుల్లాక్ సీజన్ 5 (SonyLIV): మధ్యతరగతి మిశ్రా కుటుంబం కథతో వచ్చే మోస్ట్ పాపులర్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూడొచ్చు. (తెలుగు ఆడియో అందుబాటులో ఉంది).

జీ 5 ZEE5

బ్రౌన్ : టాలెంటెడ్ బ్యూటీ కరిష్మా కపూర్ కంబ్యాక్ ఇస్తూ నటించిన నియో-నాయర్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'బ్రౌన్'. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో సాగే మర్డర్ మిస్టరీ ఇది . జీ5 లో- ఈ వెబ్ సిరీస్ జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

పేట్రియాట్ : మమ్ముట్టి, మోహన్‌లాల్, ఫహద్ ఫాసిల్ లాంటి మలయాళ సూపర్ స్టార్స్ అంతా కలిసి నటించిన భారీ స్పై యాక్షన్ డ్రామా 'పేట్రియాట్' . ఇది తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ కానుంది.

కేడీ ది డెవిల్: ధ్రువ్ సర్జా, సంజయ్ దత్ నటించిన హై-వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'కేడీ ది డెవిల్'.   జీ5  వేదికగా  జూన్ 5 సందడి చేయనున్నాయి. 

 

కేప్ ఫియర్ (Apple TV+): జేవియర్ బార్డెమ్ నటించిన మైండ్ బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్.

మూల్యం (ETV Win): అచ్చమైన హోమ్‌గ్రోన్ తెలుగు సినిమా చూడాలనుకునే వారి కోసం ఈ వారపు స్ట్రెయిట్ తెలుగు మూవీ 'మూల్యం'

మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటాన్ స్టోరీ (Amazon MX Player): టాటా బ్రాండ్ ఎలా సక్సెస్ అయిందో చూపించే జిమ్ సర్భ్, నసీరుద్దీన్ షాల బయోపిక్ డ్రామా ' మేడ్ ఇన్ ఇండియా'. ఇది జూన్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

వీటితో పాటు ఆఫీస్ రొమాన్స్ (నెట్‌ఫ్లిక్స్), మెక్సికో 86 (నెట్‌ఫ్లిక్స్ - పొలిటికల్ డ్రామా), టీచ్ యూ ఎ లెసన్ (కొరియన్ డ్రామా), పీటర్ (కన్నడ) లతో పాటు ప్రైమ్ వీడియోలో చుమ్, పిలియన్, ఒమాహా వంటి 6 కి పైగా హాలీవుడ్ సినిమాలు రెంటల్ పద్ధతిలో విడుదలవుతున్నాయి.

 

కటౌట్ ఏదైనా, జోనర్ ఏదైనా.. ఈ వీకెండ్ మాత్రం ఓటీటీ ప్రియులకు థియేటర్ ఫీలింగ్ రావడం గ్యారెంటీ. థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. మరి ఈ వీకెండ్ మీ ఓటీటీ వాచ్‌లిస్ట్‌లో ఏ సినిమాను చేర్చుకుంటున్నారో ప్లాన్ చేసుకోండి.

.