
గురువారం ఆగస్ట్ 1న ఏకంగా 12 సినిమాలు వివిధ భాషల నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చాయి. ఇవాళ శుక్రవారం (ఆగస్ట్ 2) సినిమాల రిలీజ్ కి మరి స్పెషల్ డే. దీంతో సినీ ఆడియన్స్ చూపు శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ పైనే ఎక్కువగా ఉంటుంది.
కాగా ఇవాళ థియేటర్లోకి ఓ ఆరు సినిమాలు వస్తుండగా..ఓటీటీలో ఇవాళ 4 సినిమాలు దర్శనం ఇస్తున్నాయి. అందులో ఓ రెండు సినిమాలు మాత్రం వెరీ స్పెషల్..వాటిలో ఒకటి దర్శక దిగ్గజం రాజమౌళి డాక్యుమెంటరి సిరీస్ కాగా మరొకటి బ్లాక్ బస్టర్ ఫాంటసీ కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. రాజమౌళి డాక్యుమెంటరి తెలుగు భాషతోపాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.
నెట్‌ఫ్లిక్స్
మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి (తెలుగు డాక్యుమెంటరీ)- ఆగస్ట్ 2
సేవింగ్ బికినీ బాటమ్ (ఇంగ్లీష్ చిత్రం)- ఆగస్ట్ 2
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ మూవీ)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- ఆగస్ట్ 2
బుక్ మై షో
ది బైక్ రైడర్స్ (ఇంగ్లీష్ చిత్రం)- బుక్ మై షో ఓటీటీ- ఆగస్ట్ 2
ఆలస్యం ఎందుకు మరి..ఎంచక్కా చూసేయండి.