Weekend OTT Releases: వీకెండ్ ఓటీటీ సందడి.. మే 29న ఏకంగా 16 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్!

Weekend OTT Releases: వీకెండ్ ఓటీటీ సందడి.. మే 29న ఏకంగా 16 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్!

వీకెండ్ సినీ సందడి వచ్చేసింది. అయితే ఈ అయితే ఈ వారం థియేటర్ల పరిస్థితి కాస్త చప్పగా ఉందనే చెప్పాలి. వెండితెరపై 'త్రికాల', 'బ్లాస్ట్ జోన్', 'కాటలాన్' లాంటి కొన్ని చిన్న చిత్రాలు, డబ్బింగ్ సినిమాలు మాత్రమే సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. పెద్ద సినిమాల సందడి లేకపోవడంతో సినీ ప్రేమికుల కళ్లన్నీ ఇప్పుడు ఓటీటీలపైనే పడ్డాయి. థియేటర్ల లోటును భర్తీ చేస్తూ.. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మాత్రం ఈ వారం భారీ, వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులను హోరెత్తించడానికి పక్కా ప్లాన్‌తో రెడీ అయ్యాయి.

ఇప్పటికే ధనుష్ నటించిన పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా 'కర', సత్య హిలేరియస్ ఎంటర్‌టైనర్ 'జెట్ లీ', యూత్‌ఫుల్ మూవీ 'డ్రింకర్ సాయి' వంటి చిత్రాలు డిజిటల్ స్క్రీన్స్‌పై స్ట్రీమింగ్ అవుతూ మంచి వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. ఇవి కాకుండా మే 29 శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 16కి పైగా సరికొత్త సినిమాలు, వెబ్ సిరీసులు డిజిటల్ బాట పట్టాయి. మరి మీ వీకెండ్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేయడానికి సిద్ధంగా ఉన్న ఆయా చిత్రాల విశేషాలు, అవి ఏ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నాయో పూర్తి వివరాలతో తెలుసుకుందాం..

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime)

లీడర్ (తెలుగు డబ్బింగ్): ఇంటెన్స్ పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌కు పక్కా కమర్షియల్ వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది.

సుఖమానో సుఖమమ్ (మలయాళం): కేరళ పచ్చటి నేటివిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే హార్ట్ టచింగ్, ఫీల్ గుడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇది.

ద లాస్ట్ వికింగ్ (డానిష్ మూవీ): హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో, విజువల్ వండర్‌గా సాగే అడ్వెంచరస్ యాక్షన్ అండ్ సర్వైవల్ మూవీ.

 

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney+ Hotstar)

కజిన్స్ అండ్ కల్యాణమ్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్): మన ఇళ్లలో జరిగే పెళ్లిళ్లు, కుటుంబాల మధ్య ఉండే బంధాలు, సరదాల చుట్టూ తిరిగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిరీస్.

జాలీ ఎల్ఎల్‌బీ 3 (హిందీ): బాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కోర్టు రూమ్ డ్రామా ఫ్రాంచైజీ ఇది. సమాజంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే, కడుపుబ్బా నవ్విస్తూ ఆలోచింపజేసే కథతో వస్తోంది.

లార్డ్ కర్జోన్ కీ హవేలీ (హిందీ - ): మిస్టరీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన బ్లాక్ కామెడీ థ్రిల్లర్. ఇది మే 30 శనివారం నుండి స్ట్రీమింగ్ కానుంది. అంతే కాదు ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న కమెడియన్ సత్య మార్క్ కామెడీతో సాగే 'జెట్ లీ' ఇప్పుడే వీక్షించవచ్చు.

 

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

బ్రెజిల్స్ 70: ద థర్డ్ స్టార్ (పోర్చుగీస్ సిరీస్): ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకునే స్పోర్ట్స్ డాక్యు-సిరీస్.

కలబాసస్ కాన్ఫిడెంటల్ (ఇంగ్లీష్ సిరీస్): హై-ప్రొఫైల్ సొసైటీలోని డ్రామా, క్రైమ్, మిస్టరీ అంశాలతో సాగే గ్రిప్పింగ్ టీన్ మిస్టరీ సిరీస్.

రఫా (స్పానిష్ సిరీస్): తీవ్రమైన భావోద్వేగాలు , అండర్‌వరల్డ్ క్రైమ్ ఎలిమెంట్స్‌తో నడిచే విభిన్నమైన కథనం.

ఇప్పటికే స్ట్రీమింగ్: వైవిధ్యమైన నటనతో మెప్పించే ధనుష్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కర' నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

 

ఆహా (aha)

సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ (తెలుగు): గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ జీవిత విశేషాలు, ఆయన భావోద్వేగ ప్రయాణంతో సాగే బయోపిక్. క్రికెట్ అభిమానులకు ఇది ఒక ఎమోషనల్ ట్రీట్.

 

జీ5 (ZEE5)

ద అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బెంగాలీ సిరీస్): ఆర్ట్, సస్పెన్స్, హ్యూమన్ రిలేషన్స్ చుట్టూ తిరిగే విభిన్నమైన సస్పెన్స్ డ్రామా సిరీస్. అంతే కాదు నేటి యూత్ పల్స్‌కు అద్దం పట్టే ఎంటర్‌టైనర్ 'డ్రింకర్ సాయి' ఇందులో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది

ఇక సన్ నెక్స్ట్ లో  మైండ్ బెండింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'ఫేసెస్' స్ట్రీమింగ్ కానుంది. ఇది తెలుగు డబ్బింగ్ లో అందుబాటులోకి రానుంది.

ఆపిల్ టీవీ ప్లస్:  ఇంగ్లీష్ సినిమా 'ప్రొపెల్లర్ వన్ వే నైట్ కోచ్' , అంతే కాకుండా ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ 'స్టార్ సిటీ' స్ట్రీమింగ్ కు రెడీ అయింది.

లయన్స్ గేట్ ప్లే:  హై-స్పీడ్ కార్ రేసింగ్, యాక్షన్ డ్రామా.'ద రేస్' (రొమేనియన్ మూవీ)  స్ట్రీమింగ్ కానుంది.

హెచ్‌బీఓ మ్యాక్స్ లో  ఎమోషనల్ రోమాంటిక్ లవ్ స్టోరీ. 'ద మూమెంట్' (ఇంగ్లీష్ మూవీ) స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

ఈ వీకెండ్ థ్రిల్లర్స్, పొలిటికల్ డ్రామాస్, స్పోర్ట్స్ బయోపిక్స్, కామెడీ, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని రకాల జోనర్లు మన డిజిటల్ స్క్రీన్స్‌పై అందుబాటులోకి వచ్చేశాయి. ఈ 16 చిత్రాలలో ఏ సినిమాతో హోమ్ థియేటర్ హంగామా మొదలుపెడుతున్నారో ఇప్పుడే డిసైడ్ అవ్వండి...