రాష్ట్ర బంద్: ఓయూలో టెన్షన్ టెన్షన్.. స్టూడెంట్స్ అరెస్ట్

రాష్ట్ర బంద్: ఓయూలో టెన్షన్ టెన్షన్.. స్టూడెంట్స్ అరెస్ట్

ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఓయూ విద్యార్థులు చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. రోడ్లపై టైర్లు కాల్చి ఆందోళన చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి స్టూడెంట్స్ ను చెదరగొట్టారు. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత ర్యాలీగా  తార్నాక వెళ్లేందుకు స్టూడెంట్స్ ప్రయత్నించారు. పోలీసులు విద్యార్థులను అడ్డుకుని అరెస్ట్ చేశారు. బీ హాస్టల్ గేట్ దగ్గర పోలుసులు బారికేడ్లు పెట్టారు. అయితే వాటిని దాటేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అందరినీ అరెస్ట్ చేశారు. గేట్ దగ్గరే బైఠాయించిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.