నిద్ర ఎక్కువైనా ముప్పే

నిద్ర ఎక్కువైనా ముప్పే

కొందరు కాస్త సమయం దొరికినా చాలు నిద్రపోతారు. అయితే ఎక్కు వ సమయం నిద్రపోవడం మంచిది కాదని పరిశోధనల్లో తేలింది . ఎక్కు వగా నిద్రపోయేవాళ్లు భవిష్యత్ లో మధుమేహం,స్థూలకాయం, తలనొప్పి, వెన్నునొప్పి, గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారని డాక్టర్లు చెబుతున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు నిర్వహించి న అధ్యయనంలో ఈ నిజాలు  వెల్లడయ్యాయి. ‘చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.

అయితే, అధికంగా నిద్రపోయేవాళ్లు కూడా ఈ సమస్యలు ఎదుర్కో క తప్పదు.మామూలుగా అయితే ప్రతి వ్యక్తికి ఎనిమిది గంటల నిద్ర అవసరం. అయితే, కొంతమంది అంతకుమించిన టైం నిద్రపోతారు. తొమ్మిది గంటల కంటే ఎక్కు వ సమయం నిద్రపోవటం వల్ల శరీర విధులలో ఆటంకాలు ఏర్పడతాయి. అంతేకాకుండా పది గంటల కంటే ఎక్కు వగా నిద్రించేవాళ్లు ఎప్పుడూ నీరసంగా, ఉత్సాహం కోల్పోయినట్లుగా ఉంటారు’ అని పరిశోధకులు పేర్కొన్నారు . అదేవిధంగా నిత్యం తొమ్మిది గంటల కన్నా ఎక్కు వగా నిద్రపోవడం..మద్యం , సిగరెట్ తాగడం కన్నా రెండింతలు ప్రమాదమని చెప్పారు.