రిపబ్లిక్ డేకి తంగలాన్ రిలీజ్

రిపబ్లిక్ డేకి తంగలాన్ రిలీజ్

విక్రమ్ నటిస్తున్న కొత్త సినిమా ‘తంగలాన్’.  పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. పార్వతీ, మాళవిక మోహనన్ హీరోయిన్స్.  కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది.

ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు అలాగే, నవంబర్ 1న టీజర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.