
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ఈ మేరకు ఇండియాతో రెండో టెస్ట్ కోసం అతన్ని ఇంగ్లండ్ టీమ్‌లోకి తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా మోచేతి గాయంతో ఇబ్బందిపడుతున్న ఆర్చర్.. నాలుగేళ్ల కిందట ఇండియాతోనే చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ‘ఫిబ్రవరి 2021 తర్వాత ఆర్చర్ మళ్లీ ఇంగ్లండ్ టెస్ట్ సెటప్‌లోకి వచ్చాడు. కెరీర్‌లో 14వ టెస్ట్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు’ అని ఈసీబీ పేర్కొంది. ఇక ఇండియాపై తొలి టెస్ట్‌లో గెలిచిన ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇరుజట్ల మధ్య రెండో టెస్ట్ జులై 2 నుంచి జరుగుతుంది.
జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), ఒలీ పోప్, హ్యారీ బ్రూక్, జో రూట్, బెన్ డకెట్, జాక్ క్రాలీ, జెమీ స్మిత్, సామ్ కుక్, జాకబ్ బీథెల్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్, బ్రైడన్ కార్సీ, జెమీ ఓవర్టన్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్.