పహల్గాం లవ్ స్టోరీ రిలీజ్‌‌‌‌కు రెడీ

పహల్గాం లవ్ స్టోరీ రిలీజ్‌‌‌‌కు రెడీ

దర్శకనిర్మాత పి.ఎన్. రామచంద్రరావు తెరకెక్కించిన  చిత్రం ‘పహల్గాం లవ్ స్టోరీ’. కృష్ణ మోహన్, చిత్రశుక్ల హీరో హీరోయిన్స్‌‌‌‌గా నటించగా, సుమన్, పూజా బిస్త్, జయప్రకాష్ నారాయణ కీలక పాత్రలు పోషించారు.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌‌‌‌కు రెడీ అవుతోంది. మనసుకు హత్తుకునే రొమాంటిక్ లవ్ స్టోరీని చూపిస్తూనే  దేశభక్తి, జాతీయ సమైక్యత వంటి అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నట్టు దర్శక నిర్మాత పి.ఎన్.రామచంద్రరావు తెలియజేశారు.