పులితో గేమ్సా: నడి వీధుల్లోకి పులిని పట్టుకొచ్చిన వ్యక్తి.. పరుగులు పెట్టిన జనం

పులితో గేమ్సా: నడి వీధుల్లోకి పులిని పట్టుకొచ్చిన వ్యక్తి.. పరుగులు పెట్టిన జనం

‘‘పులితో ఫొటో దిగాలనిపించిందనుకో..కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేసుకోవచ్చు..సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది’’. ఓవ్యక్తి పులితో వీధుల్లో సంచరిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పులితో కనిపిస్తున్న వ్యక్తి ని చూస్తే ఈ డైలాగ్ గుర్తుకొస్తోంది. సరిగ్గా ఈ డైలాగ్ ఇతనికి సరిపోతుందనుకుంటా. పులి మెడకు గొలుసు కట్టి వీధుల్లోకి తీసుకొచ్చాడు.అడవి మృగం అది.. ఏమాత్రం తేడా వచ్చినా..చీల్చి చెండాడేస్తది.పులిని రోడ్లమీద తిప్పుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. 

ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఓ వ్యక్తి పులి మెడకు గొలుసు కట్టి వీధుల్లోకి తీసుకొచ్చిన భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి.  పులి అతడినుంచి విడిపించుకొని పోయేందుకు ప్రయత్నిస్తోంది.. దారిన పోయే వాహనాలపైకి పంజా విసురుతోంది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురి అయినట్లు కనిపిస్తోంది. వీడియోలో కనిపిస్తున్న బ్యాంక్ ఆఫ్ ఖైబర్ అని బోర్డు కనిపిస్తోంది.. దీనిని బట్టి ఈ ఘటన పాకిస్తాన్ లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ వీడియో నెటిజన్ల మాత్రం ఇతనిపై గుస్సా అయితున్నారు. అడవిలో తిరిగే క్రూర మృగాలను పెంచుకోవడం ఏంటీ.. రోడ్లపై తిప్పడం ఏంటీ.. ఏమాత్రం తేడా వచ్చినా.. అత్యంత ప్రమాదకరం..అని ప్రజల భద్రత, జంతువుల సంక్షేమం గురించి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ALSO READ :ఎప్పుడు ఇలా దొరికిపోలే.. యంగ్​ హీరోతో రహస్య ప్రేమ!