Pallavi Prashanth: మా నాన్నను అలా చూసి చచ్చిపోవాలనిపించింది.. కన్నీళ్లు పెట్టుకున్న పల్లవి ప్రశాంత్

Pallavi Prashanth: మా నాన్నను అలా చూసి చచ్చిపోవాలనిపించింది.. కన్నీళ్లు పెట్టుకున్న పల్లవి ప్రశాంత్

బిగ్ బాస్(Bigg boss) కప్పు తీసుకొచ్చి మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాను కానీ, నాకోసం జైలు ముందు పడుకోవడం చూసి నా గుండె బద్దలయింది అంటూ బోరున ఏడ్చాడు బిగ్ బాస్ విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth). అలాగే తాను అరెస్ట్ విషయంపై కూడా తొలిసారి స్పందించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే..  తాజాగా పల్లవి ప్రశాంత్ బీబీ ఉత్సవం ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ కు బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అందరూ పాల్గొన్నారు. ఆట, పాటలతో అలరిస్తూ బిగ్ బాస్ సీజన్ 7 మెమోరీస్ ను గుర్తుచేసుకొని ఫుల్లు గా ఎంజాయ్ చేశారు.మధ్య మధ్యలో టాస్కులు ఆడుతూ ఆడియన్స్ ను ఫులుగా ఎంటర్టైన్ చేయనున్నారు. ఈ ఈవెంట్ త్వరలోనే ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ కానుంది. తాజాగా ఈ ఈవెంట్ కు సంబందించిన ప్రోమో రిలీజ్ చేశారు షో నిర్వాహకులు. 

ఈ ప్రోమోలో పల్లవి ప్రశాంత్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అతను చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఆడియన్స్ చేత కూడా కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఈ ప్రోమోలో పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ సీజన్ 7 కప్పు గెలిచి ఆది మా నాన్న చేతిలో పెట్టి ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాను. కానీ, నావల్ల ఆయన కోర్టు బయట పడుకోవాల్సి వచ్చింది. మా నాన్నని అలా చూసి నేను ఇంకా ఎందుకు బ్రతికున్నాను అనిపించింది.. అంటూ బోరున ఏడ్చాడు. దాంతో షోలో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.