కల్లు దుకాణాలకు అల్ఫ్రాజోలమ్.. అక్రమ రవాణా ముఠా అరెస్ట్..ఈగల్‌‌‌‌ఫోర్స్, రాచకొండ నార్కోటిక్ పోలీసులనిఘా

కల్లు దుకాణాలకు అల్ఫ్రాజోలమ్.. అక్రమ రవాణా ముఠా అరెస్ట్..ఈగల్‌‌‌‌ఫోర్స్, రాచకొండ నార్కోటిక్  పోలీసులనిఘా

పద్మారావునగర్, వెలుగు: అల్వాల్ పోలీస్‌‌‌‌స్టేషన్ పరిధిలోని మచ్చబొల్లారం రుక్మిణి ఎన్‌‌‌‌క్లేవ్‌‌‌‌లో అల్ఫ్రాజోలమ్ అక్రమ రవాణా చేస్తున్న ముఠాను తెలంగాణ ఈగల్‌‌‌‌ఫోర్స్, రాచకొండ నార్కోటిక్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తెల్లవారుజామున ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అనుమానాస్పదంగా కనిపించిన కారును తనిఖీ చేయగా నిషేధిత అల్ఫ్రాజోలమ్‌‌‌‌ను కల్లు దుకాణాల నిర్వాహకులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.25 లక్షల విలువైన 1.189 కిలోల అల్ఫ్రాజోలమ్, రూ.5.45 లక్షల నగదు, ఎనిమిదిసెల్‌‌‌‌ఫోన్లు, మారుతి బ్రీజా కారును స్వాధీనం చేసుకున్నారు.