యశ్ 19వ చిత్రం అప్‌‌డేట్‌‌

యశ్ 19వ చిత్రం అప్‌‌డేట్‌‌

‘కేజీఎఫ్‌‌’ బ్లాక్ బస్టర్‌‌‌‌ సక్సెస్‌‌తో పాన్‌‌ ఇండియా స్టార్​గా ఎదిగిన యశ్.. ‘కేజీఎఫ్‌‌ 2’ విజయంతో తన పాపులారిటీని మరింత పెంచుకున్నాడు. అయితే ఈ సినిమా వచ్చి ఒకటిన్నర ఏడాది అవుతోంది. అప్పటి నుండి ఎప్పుడెప్పుడు యశ్‌‌ కొత్త సినిమాను అనౌన్స్ చేస్తాడా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇటీవల తన కొత్త సినిమా విషయంలో కొన్ని గాసిప్స్ వినిపించినా అవేవీ పట్టాలెక్కలేదు. ఫైనల్‌‌గా తన నెక్స్ట్ మూవీపై అప్‌‌డేట్‌‌ ఇచ్చాడు యశ్. కేవీఎన్‌‌ ప్రొడక్షన్స్‌‌లో తన 19వ చిత్రం ఉండబోతోందని సోమవారం ప్రకటించాడు.

అంతేకాదు ఈ మూవీ టైటిల్‌‌ను ఈనెల 8న ఉదయం 9 గంటల 55 నిమిషాలకు రివీల్ చేయబోతున్నట్టు చెప్పాడు. డైరెక్టర్‌‌‌‌ ఎవరనేది కూడా ఆరోజే అనౌన్స్‌‌ చేయబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌‌పైకి వెళ్లనుంది. ‘కేజీఎఫ్‌‌’తో జాతీయ స్థాయిలో మాస్‌‌ ఇమేజ్‌‌ తెచ్చుకున్న యశ్.. ఈసారి ఎలాంటి జానర్‌‌‌‌లో సినిమా చేయబోతున్నాడో అనే ఆసక్తి నెలకొంది.