
దుబాయ్: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను సాధించాడు. బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో పంత్ (801) ఒక్క ప్లేస్ మెరుగుపడి ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేయడం అతని ర్యాంక్ మెరుగుపడటానికి దోహదం చేసింది. యశస్వి జైస్వాల్ (851) ఎలాంటి మార్పు లేకుండా నాలుగో ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (660) ఐదు ప్లేస్‌లు ఎగబాకి 20వ ర్యాంక్‌కు చేరాడు.
బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా (907) నంబర్ వన్‌లోనే కొనసాగుతున్నాడు. లీడ్స్ టెస్ట్‌లో ఐదు వికెట్లు తీయడంతో బుమ్రా ర్యాంక్‌లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. రవీంద్ర జడేజా (706) మూడు ప్లేస్‌లు దిగజారి 13వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ (787) ఐదు ప్లేస్‌లు మెరుగుపడి ఎనిమిదో ర్యాంక్‌ను సాధించాడు. ఒలీ పోప్ (667), జెమీ స్మిత్ (619) వరుసగా 19, 27వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. జో రూట్ (874), హ్యారీ బ్రూక్ (874) టాప్–2లో ఉన్నారు. ఆల్‌రౌండర్స్ లిస్ట్‌లో బెన్ స్టోక్స్ ఐదో ర్యాంక్‌లో ఉన్నాడు.