న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, ప్రముఖ ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ అక్టోబర్ 23న జరగనున్న సర్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొననున్నారు. పీపుల్ ఎగైనెస్ట్ ఎస్ఐఆర్ కూటమి ఆధ్వర్యంలో జరగనున్న దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఆయన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో వేదిక పంచుకోనున్నారు.
సర్ ప్రక్రియను రద్దు చేయాలని, సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ‘హర్ గలీ మే జంతర్ మంతర్ ! 2026 అక్టోబర్ 23న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజల కవాతు.
ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకు అందరూ కదిలిరావాలి' అని పరకాల ప్రభాకర్ ట్వీట్ చేశారు. భార్య నిర్మలా సీతారామన్ బీజేపీలో ఉన్నప్పటికీ, ఆయన మాత్రం కేంద్ర విధానాలపై బహిరంగంగా గళం వినిపిస్తూనే ఉన్నారు.
