
‘బిగ్‌బాస్’ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా నాగ శివ రూపొందించిన చిత్రం ‘పరమపద సోపానం’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మించారు. జులై 11న సినిమా విడుదల కానుంది. సోమవారం ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత సి.కళ్యాణ్ టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు. ఈ సందర్భంగా అర్జున్ అంబటి మాట్లాడుతూ ‘శివ ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యాను. తను పూరి జగన్నాథ్ గారి అసిస్టెంట్ కావడంతో ఆయన స్టైల్‌లోనే ఈ సినిమాను తీశారు. అవుట్‌పుట్ బాగా వచ్చింది.
కచ్చితంగా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది’ అని చెప్పాడు. హీరోయిన్ జెన్నిఫర్ మాట్లాడుతూ ‘ఇందులో నేహా అనే పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాను. రెగ్యులర్ హీరోయిన్‌లా కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్ చేశా’ అని చెప్పింది. యాక్షన్ సీన్స్, ఎమోషన్స్‌తో అందర్నీ అలరించేలా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు నాగ శివ చెప్పాడు. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుందని నిర్మాత శివ ప్రసాద్ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ డేవ్ జాండ్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.