బీజేవైఎం రంగారెడ్డి జిల్లా (అర్బన్) ఉపాధ్యక్షుడిగా పారంద సాయి నియామకం

బీజేవైఎం రంగారెడ్డి జిల్లా (అర్బన్) ఉపాధ్యక్షుడిగా పారంద సాయి నియామకం

రంగారెడ్డి: భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) రంగారెడ్డి జిల్లా (అర్బన్) ఉపాధ్యక్షుడిగా పారంద సాయిని పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సాయిరాం గౌడ్‌లు పారంద సాయికి నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా పారంద సాయి మాట్లాడుతూ తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ, బీజేవైఎం రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో, అంకితభావంతో నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు, యువతను భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షించేందుకు నిరంతరం పనిచేస్తానని పారంద సాయి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యువజన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వాటిపై యువతకు అవగాహన కల్పిస్తానని తెలిపారు.తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి, యువత అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.